తనతో కలిసి కాఫీ తాగాలని ఉంది: వరుణ్‌తేజ్‌
close
Published : 05/02/2020 09:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తనతో కలిసి కాఫీ తాగాలని ఉంది: వరుణ్‌తేజ్‌

హైదరాబాద్‌: గతేడాది ‘గద్దల కొండ గణేష్‌’గా ప్రేక్షకులను అలరించారు యువ కథానాయకుడు వరుణ్ తేజ్‌.  ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.  ఇందులో వరుణ్‌తేజ్‌ ప్రొఫెషనల్‌ బాక్సర్‌గా కనిపించనున్నారు. పర్‌ఫెక్ట్‌ లుక్‌ కోసం ముంబయిలో ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ రాకేష్‌ ఉడయార్‌, బాక్సర్‌ నీరజ్‌ గోయత్‌ల వద్ద రెండు వారాలుగా శిక్షణ తీసుకుంటున్నారు. 

ఈ సందర్భంగా బాలీవుడ్‌లో మీ ఫేవరెట్‌ ఎవరు? అనే ప్రశ్నకు సమాధానంగా ...తాను షారుఖ్‌ ఖాన్‌కు పెద్ద ఫ్యాన్‌నని వరుణ్‌తేజ్‌ చెప్పారు. ‘‘ఒకసారి షారుఖ్‌ (రామ్‌) చరణ్‌ ఇంటికి వచ్చారు. కానీ, నేను అతన్ని దూరం నుంచి చూస్తూ ఉండిపోయాను. ఆయనతో కాఫీ తాగుతూ ముచ్చటించాలని ఉంది... ఆయన నుంచి నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అఫ్‌కోర్స్‌, ఆయనతో పని చేయాలని కూడా ఉంది... అయినా అలా ఎవరికి ఉండదు.’’ అని చెప్పుకొచ్చారు. 

‘‘నాకు ఇప్పటికీ బాలీవుడ్ నుంచి ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. షెడ్యూల్‌ సహకరించక కొన్ని, కథ నచ్చక మరికొన్ని చిత్రాలకు  నో చెప్పా. నాకు బాలీవుడ్ చిత్రాలలో నటించడమంటే చాలా ఆశక్తి. కంటెంట్‌ బాగుంటే నాకు భాష విషయంలో పట్టింపులు లేవు. మంచి కథలకు ఏ భాషా, ప్రాంతీయ భేదాలు అడ్డు రావు అనటానికి ‘బాహుబలి’ ఒక చక్కటి ఉదాహరణ.’’ అని వరుణ్‌తేజ్‌ తెలిపారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని