వైభ‌వంగా కోడిరామ‌కృష్ణ చిన్న కుమార్తె వివాహం
close
Updated : 06/02/2020 18:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వైభ‌వంగా కోడిరామ‌కృష్ణ చిన్న కుమార్తె వివాహం

హైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమపై చెరగని ముద్రవేసిన దివంగత దర్శకుడు కోడిరామకృష్ణ. గురువారం ఆయన చిన్నకుమార్తె ప్రవల్లిక వివాహం మహేశ్‌తో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

హైదరాబాద్ గండిపేట‌లోని క‌న్వెష‌న్స్ అండ్ ఎగ్జిబిష‌న్‌లో ప్రవల్లిక, మహేశ్‌ల వివాహం అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. మెగాస్టార్ చిరంజీవి, నంద‌మూరి బాల‌కృష్ణ‌, మోహ‌న్ బాబు, మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాదవ్‌, మాజీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు,  కె.రాఘ‌వేంద్ర‌రావు, ముర‌ళీ మోహ‌న్‌, గోపీచంద్‌, జ‌య‌ప్ర‌ద‌, జీవిత‌, దిల్ రాజు, కోదండ రామిరెడ్డి, కె.విజ‌య‌భాస్క‌ర్‌, బి.గోపాల్‌, అల్లు అర‌వింద్‌, ద‌ర్శ‌క నిర్మాత ఎం.ఎస్.రాజు, నంద‌మూరి రామ‌కృష్ణ‌, పోకూరి బాబూరావు, ప‌రుచూరి గోపాల‌కృష్ణ‌, దేవీప్ర‌సాద్‌, వీర‌శంక‌ర్‌, శివాజీరాజా, మారుతి, ముత్యాల సుబ్బ‌య్య‌, వినోద్‌కుమార్‌, కాశీ విశ్వ‌నాథ్‌, అలీ, హేమ‌, నాగ‌బాబు స‌తీమ‌ణి ప‌ద్మ‌జ‌, కుమార్తె నిహారిక‌, న‌టి శివ‌పార్వ‌తి, రాజ‌శేఖ‌ర్ కుమార్తె శివాని త‌దిత‌రులతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజ‌రై నూతన వధూవరులను ఆశీర్వదించారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని