‘RRR’: నెటిజన్‌ ట్వీట్‌.. శోభూ రిప్లై
close
Published : 07/02/2020 14:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘RRR’: నెటిజన్‌ ట్వీట్‌.. శోభూ రిప్లై

ఒక్కసారి మాత్రమే వెళ్లాను: ‘బాహుబలి’ నిర్మాత

హైదరాబాద్‌: టాలీవుడ్‌లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కథ తనకు తెలియదని ‘బాహుబలి’ నిర్మాత శోభూ యార్లగడ్డ తెలిపారు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సినిమా కథ ఏమిటి? ఎలా ఉండబోతుంది? అనే విషయాలను తెలుసుకోవాలని నెటిజన్లు ఆతృతగా ఉన్నారు. దీంతో తాజాగా ఓ నెటిజన్‌ ట్విటర్‌ వేదికగా ‘బాహుబలి’ నిర్మాత శోభూ యార్లగడ్డను ట్యాగ్‌ చేస్తూ.. ‘దర్శకధీరుడు రాజమౌళికి మంచి స్నేహితులైన మీరు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కథ  ఏమిటని తెలుసుకున్నారా? ఒకవేళ మీకు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కథ తెలిస్తే.. బాక్సాఫీస్‌ వద్ద ఆ సినిమా ఎలా ఆడబోతుందని మీ అభిప్రాయం’ అని ట్వీట్‌ చేశారు.

నెటిజన్‌ పెట్టిన ట్వీట్‌పై స్పందించిన శోభూ ట్విటర్‌ వేదికగా అతనికి రిప్లై ఇచ్చారు. ‘‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా కథ నాకూ తెలియదు. నిజం చెప్పాలంటే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ షూటింగ్‌కి ఒక్కరోజు మాత్రమే వెళ్లాను. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా తప్పకుండా ఇండస్ట్రీ హిట్‌ను సొంతం చేసుకుంటుందని నేను నమ్మకంగా చెప్పగలను’ అని శోభూ తెలిపారు.

టాలీవుడ్‌ అగ్రకథానాయకులు ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ మొదటిసారి కలిసి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్‌, హాలీవుడ్‌కు చెందిన తారలు సందడి చేయనున్నారు. ఈ చిత్రంలో రామ్‌చరణ్‌.. అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్‌.. కొమరంభీంగా కనిపించనున్న విషయం తెలిసిందే. రామ్‌చరణ్‌కు జంటగా ఆలియాభట్‌, ఎన్టీఆర్‌కు జంటగా హాలీవుడ్‌ నటి ఒలీవియా మోరీస్‌ సందడి చేయనున్నారు. వీరితోపాటు బాలీవుడ్‌ నటుడు అజయ్‌దేవగణ్‌ కీలకపాత్రలో కనిపించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 8 ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని