అనసూయ ఫొటోను మార్ఫింగ్‌ చేశారట!
close
Published : 08/02/2020 18:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అనసూయ ఫొటోను మార్ఫింగ్‌ చేశారట!

హైదరాబాద్‌: యాంకర్‌గా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు అనసూయ. టెలివిజన్‌ షోకు ఆమె వ్యాఖ్యాతగా ఉంటే ఆ షోలో సందడే వేరు. మరోవైపు నటిగానూ వెండితెరపై వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుని ముందుకు సాగుతున్నారు. తాజాగా తనకు సంబంధించిన ఒక ఫొటోను మార్ఫింగ్‌ చేసి, సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారని అనసూయ మండిపడ్డారు. అలాంటి పోస్టులు కనపడితే వెంటనే తెలియజేయాలని ఇన్‌స్టా వేదికగా కోరారు.

‘‘హలో! నాకు సంబంధించిన ఒక ఫొటోను మార్ఫింగ్‌ చేసి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారు. ఇదిగో ఇదే అసలైన చిత్రం. దయచేసి ఆ మార్ఫింగ్‌ ఫొటో ఎక్కడ కనపడినా తెలియజేయండి. ధన్యవాదాలు’’ -ఇన్‌స్టాలో అనసూయ.

వివిధ షోలతో బిజీగా ఉన్న అనసూయ ప్రస్తుతం రెండు భారీ ప్రాజెక్టుల్లో నటించనున్నట్లు సమాచారం. సుకుమార్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ కథానాయకుడిగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో అనసూయ కీలక పాత్రలో నటించనున్నారని తెలుస్తోంది. దీంతోపాటు పవన్‌-క్రిష్‌ కాంబినేషన్‌లో తెరకెక్కే సినిమాలోనూ అవకాశం దక్కించుకున్నట్లు టాలీవుడ్‌ టాక్‌. మరి ఈ సినిమాల్లో అనసూయ నటిస్తున్నారా? లేదా? తెలియాలంటే ఇంకొంతకాలం ఆగాల్సిందే!మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని