రామ్‌చరణ్‌ను ప్రశంసించిన ఇన్ఫోసిస్‌ సుధామూర్తి
close
Updated : 09/02/2020 18:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రామ్‌చరణ్‌ను ప్రశంసించిన ఇన్ఫోసిస్‌ సుధామూర్తి

హైదరాబాద్‌: టాలీవుడ్‌ యువ కథానాయకుడు రామ్‌చరణ్‌ను ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌ సుధామూర్తి ప్రశంసించారు. తాజాగా ఆమెను ఓ ఛానెల్‌ వారు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశారు. దీనిలో ఆమె తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికర విశేషాలను వెల్లడించారు. అనంతరం ఆమె ఇటీవల ‘రంగస్థలం’ సినిమాను చూశానన్నారు. రామ్‌చరణ్‌ నటన అద్భుతంగా ఉందని ప్రశంసించారు. 

‘చిన్నతనంలో ఎక్కువగా రామారావు(ఎన్టీఆర్‌) సినిమాలు చూసేదానిని. ఆయన నటించిన ‘మాయాబజార్‌’, ‘దాన వీర శూర కర్ణ’, ‘సీతా స్వయంవరం’ చిత్రాలను చూశాను. మనకి కృష్ణుడు ఎలా ఉంటారో తెలియదు. కృష్ణుడిని ఎప్పుడూ చూడలేదు. కానీ, నా దృష్టిలో మాత్రం కృష్ణుడంటే ఎన్టీఆరే. ఎప్పుడైనా కళ్లు మూసుకుని కృష్ణుడిని స్మరిస్తే.. నాకు ఆయనే కనిపిస్తారు. అంతేకాకుండా.. ‘అన్నమయ్య’, ‘ఓం నమో వెంకటేశాయా’, ‘భక్త ప్రహ్లాద’ చిత్రాలను కూడా చూశాను. ఇటీవల నేను రామ్‌చరణ్‌ నటించిన ‘రంగస్థలం’ సినిమాను వీక్షించాను. ఆ సినిమా చాలా బాగుంది. రామ్‌చరణ్‌ నటన అద్భుతంగా ఉంది. వీటితోపాటు ‘మనం’ కూడా చూశాను. అలాగే కన్నడ సినిమాలు కూడా ఎక్కువగా చూస్తాను’ అని ఆమె ఓ సందర్భంలో పంచుకున్నారు.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని