ఆ కామెంట్లు పెట్టేవారు తప్పించుకోలేరు: అనసూయ
close
Updated : 11/02/2020 13:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ కామెంట్లు పెట్టేవారు తప్పించుకోలేరు: అనసూయ

హైదరాబాద్‌: తన గురించి అభ్యంతరకరంగా ట్వీట్‌లు, కామెంట్లు చేసే వారికి అరెస్టులు తప్పవని బుల్లితెర వ్యాఖ్యాత, నటి అనసూయ హెచ్చరించారు. ‘యాక్టర్స్‌ మసాలా’ అనే పేరుతో ఉన్న ట్విటర్‌ ఖాతా నుంచి గత కొంతకాలంగా సినీ పరిశ్రమకు చెందిన చాలా మంది స్టార్స్‌కు సంబంధించిన విషయాలను అభ్యంతరకర భాషలో చర్చిస్తూ ట్వీట్లు వస్తున్నాయి. ఈ ట్వీట్లను చూసిన అనసూయ ఆవేదనకు గురై సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం అనసూయ తన ఇన్‌స్టా వేదికగా అభిమానులతో మాట్లాడారు. 

‘‘హాయ్‌.. అందరికీ నమస్కారం. నిన్న సాయంత్రం జరిగిన వార్త గురించి అందరితో మాట్లాడాలనుకున్నా. అందరూ చాలా పాజిటివ్‌గా స్పందించారు. అందుకు అభిమానులకు, మీడియా మిత్రులకు ముఖ్యంగా క్రైమ్‌ ఏసీపీ ప్రసాద్‌గారికి, సాయిరాజేశ్‌ గారికి ధన్యవాదాలు. ఈ సందర్భంగా మరో విషయం చెప్పాలనుకుంటున్నా. కొందరు వ్యక్తులు యూట్యూబ్‌ వీడియోల కింద అసభ్య సందేశాలు పెడుతున్నారు. గతంలో కూడా వాటిని చూశా. వారంతా ఎప్పటికైనా మారకపోతారా? అని ఇన్నాళ్లూ అన్ని రకాలుగా చూశా. ఎలాంటి ఫలితం కనిపించలేదు. ‘జబర్దస్త్’‌, సినిమాల్లో నటించడం కేవలం ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసమే. ఎవరినీ ఉద్దేశించి కాదు. కానీ, కొందరు వ్యక్తులు మాత్రం పనిగట్టుకుని కామెంట్లు పెడుతున్నారు. పోనీలేనని చూస్తూ ఉంటే బాగా రెచ్చిపోతున్నారు’’

‘‘అసభ్య కామెంట్లు పెట్టేవారందరినీ వెతికి పట్టుకుని అరెస్టు చేస్తామని ఏసీపీ ప్రసాద్‌గారు చెప్పారు. నాకు తెలిసి సామూహిక అరెస్టులు జరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎవరినీ వదిలి పెట్టరు. ఎవరూ తప్పించుకోలేరు. సోషల్‌మీడియాలో మహిళలంటే చిన్నచూపు ఉంది. విమర్శలు చేయొచ్చు. కానీ, అసభ్య పదజాలం వాడటం సరైన పద్ధతి కాదు. యూట్యూబ్‌లో కామెంట్లు పెట్టే వారందరినీ బయటకు తీసుకొస్తా. పిరిపందల్లా ఆ కామెంట్లు డిలీట్‌ చేసుకుంటే చేసుకోండి. మీకో అవకాశం ఇస్తున్నా. అయితే, ప్రతి విషయాన్ని నోట్‌ చేసుకుంటా. దండన తప్పదని అనిపిస్తోంది. అసభ్య పదజాలంతో కామెంట్లు పెట్టేవారు ఇక తప్పించుకోలేరు’’ అని అనసూయ చెప్పుకొచ్చారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని