పసుపులేటి మృతిపై పవన్‌,మోహన్‌బాబు సంతాపం
close
Updated : 11/02/2020 20:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పసుపులేటి మృతిపై పవన్‌,మోహన్‌బాబు సంతాపం

హైదరాబాద్‌: సీనియర్‌ జర్నలిస్టు, సినీ పీఆర్‌వో పసుపులేటి రామారావు మరణంపై సినీ నటులు పవన్‌కల్యాణ్‌, మోహన్‌బాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల వేదికగా సంతాపం తెలియజేశారు. పసుపులేటి రామారావు మరణించారనే వార్త బాధకు గురి చేసిందని పవన్‌కల్యాణ్‌ అన్నారు. వ్యక్తిగతంగా ఆయనతో చిన్నప్పటి నుంచి పరిచయం ఉందని తెలిపారు. తెలుగు సినిమాపై పలు రచనలు చేసి సినీ చరిత్రకు అక్షర రూపం ఇవ్వడంలో తన వంతు పాత్ర పోషించారని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

పసుపులేటి రామారావు మరణం వ్యక్తిగతంగా తనకు తీరని లోటని మోహన్‌బాబు అన్నారు. ఆయన మరణ వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యానని పేర్కొన్నారు. తాను నటుడిగా పరిచయమైనప్పట్నుంచి ఆయనతో స్నేహం ఉందని, మద్రాసులో ఎంత సన్నిహితంగా ఉన్నామో, హైదరాబాద్‌కు వచ్చాక కూడా అంతే సన్నిహితంగా మెలిగామని గుర్తు చేసుకున్నారు. నిజాయతీకి నిలువెత్తు నిదర్శనంగా ఆయన పేరు తెచ్చుకున్నారని కొనియాడారు. ఎన్నోసార్లు ఆయన తనను ఇంటర్వ్యూ చేశారని, సినిమా జర్నలిస్టుగా చిత్రసీమకు ఆయనెంతో సేవచేశారని అన్నారు. రామారావు ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని మనసారా ప్రార్థిస్తున్నానని తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. రామారావు మృతి పట్ల పలువురు నటీనటులు సంతాపం తెలియజేశారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని