మిల్కీబ్యూటీని బీట్‌ చేసేలా సితార స్టెప్పులు
close
Published : 14/02/2020 11:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మిల్కీబ్యూటీని బీట్‌ చేసేలా సితార స్టెప్పులు

పార్టీ సాంగ్‌ వీడియో చూశారా

హైదరాబాద్‌: సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు కుమార్తె సితార.. మిల్కీబ్యూటీ తమన్నాను బీట్‌ చేసేలా స్టెప్పులేశారు. మహేశ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘సరిలేరునీకెవ్వరు’. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మహేశ్‌ ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించారు. ఈ సినిమాలో తమన్నా ‘డాంగ్‌ డాంగ్‌’ అనే పార్టీ సాంగ్‌కు తనదైన శైలిలో డ్యాన్స్‌ చేసి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ‘డాంగ్‌ డాంగ్‌’ పాటకు మహేశ్‌ కుమార్తె సితార అదరగొట్టేలా స్టెప్పులు వేసింది. దీనికి సంబంధించిన వీడియోను నమ్రత ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేసింది. మరోవైపు సితార డ్యాన్స్‌ చూసిన నెటిజన్లు.. ‘సితార డ్యాన్స్‌తో అదరగొట్టేశారు’, ‘మిల్కీ బ్యూటీని బీట్‌ చేసేశారు’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

ఇప్పటికే సితార చాలా సందర్భాల్లో మహేశ్ నటించిన చిత్రాల్లోని పలు పాటలకు డ్యాన్స్‌ చేసి ఆకట్టుకున్నారు. ఆయా వీడియోలను నమ్రత సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఇటీవల ‘He is So Cute, He is So Sweet’ సాంగ్‌కు డ్యాన్స్‌ చేసి మెప్పించిన సితార.. దీపికా పదుకొణె నటించిన ‘పద్మావత్‌’ సినిమాలోని ‘గూమర్‌’ సాంగ్‌తోపాటు బాహుబలి సినిమాలోని ఓ పాటకు కూడా డ్యాన్స్‌ చేసి ఆకట్టుకున్నారు. వంశీ పైడిపల్లి కుమార్తె ఆద్యాతో కలిసి సితార ‘A&S’ పేరుతో ఓ యూట్యూబ్‌ ఛానల్‌ను నిర్వహిస్తోంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని