ముంబయిలో షూటింగ్‌.. ఇంటి నుంచే ఫుడ్
close
Published : 15/02/2020 12:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ముంబయిలో షూటింగ్‌.. ఇంటి నుంచే ఫుడ్

విదేశాల్లో కొంచెం ఇబ్బందిపడతా: రకుల్‌ ప్రీత్‌

హైదరాబాద్‌ : ముంబయిలో షూటింగ్‌ జరిగితే తన ఇంటి నుంచే ఫుడ్ తీసుకెళ్తారట నటి రకుల్‌ప్రీత్‌ సింగ్‌. దక్షిణాది చిత్రాలతోపాటు బాలీవుడ్‌ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటున్నారు రకుల్‌. మాంసాహారాన్ని ఎంతో ఇష్టపడే ఆమె గతకొంతకాలంగా శాకాహారిగా మారారు. ఇటీవల ఆమె ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ.. శాకాహారిగా ఎందుకు మారానో వివరించారు. ‘నేను మాంసాహార ప్రియురాలిని. అలాగే శాకాహారం అంటే కూడా ఇష్టమే. కాకపోతే నా డైట్‌లో భాగంగా మాంసాహారం, ముఖ్యంగా కోడిగుడ్లును ఎక్కువగా తినేదాన్ని. అయితే అనుకోకుండా ఒకరోజు శాకాహారిగా మారాలనిపించింది. వెంటనే మారిపోయాను. శాకాహారిగా మారడానికి ప్రత్యేకంగా ఎలాంటి కారణం లేదు. శాకాహారిగా మారిన తర్వాత మరింత ఉత్సాహంగా ఉన్నాననిపిస్తోంది’ అని రకుల్‌ తెలిపారు.

ప్రయాణాల్లో, విదేశాల్లో షూటింగ్‌ సమయాల్లో ఫుడ్‌ విషయంలో ఏమైనా ఇబ్బంది పడ్డారా?అని రకుల్‌ను ప్రశ్నించగా.. ‘ముంబయిలో షూటింగ్‌ జరిగితే.. ఇంటి నుంచే పండ్లు, భోజనం, వెజ్‌ షేక్స్‌ తీసుకువెళ్తాను. విదేశాలకు వెళ్లినప్పుడు కొంచెం ఇబ్బంది పడుతుంటాను. ఎందుకంటే అక్కడ చేపలు, చికెన్‌ ఎక్కువగా దొరుకుతాయి. ఆ సమయంలో ఏవైనా కూరగాయలు దొరికితే వాటిని మా టీం కొనితెచ్చి.. కొంచెం అన్నం, పప్పు వేసి కిచిడీలాగా చేసి పెడతారు. అందులో నేను కొంచెం నెయ్యి కలుపుకొని తింటాను.’ అని సమాధానం ఇచ్చారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని