టీజర్ హిట్‌.. శేఖర్‌కు చై గిఫ్ట్‌
close
Published : 15/02/2020 14:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టీజర్ హిట్‌.. శేఖర్‌కు చై గిఫ్ట్‌

ఇంకో గిఫ్ట్‌ రెడీ చేస్కో అంటున్న శేఖర్‌ కమ్ముల

హైదరాబాద్‌: సహజత్వం ఉట్టిపడేలా ప్రేమకథా చిత్రాలను తెరకెక్కించే దర్శకుడు శేఖర్‌ కమ్ములకు హీరో నాగచైతన్య స్పెషల్‌ గిఫ్ట్‌ను అందించారు. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషల్‌లో ‘లవ్‌స్టోరీ’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో నాగచైతన్యకు జంటగా సాయిపల్లవి నటిస్తున్నారు. ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ సినిమా నుంచి ‘ఏయ్‌ పిల్లా’ అనే పాటకు సంబంధించిన ప్రివ్యూ వీడియోను చిత్రబృందం శుక్రవారం విడుదల చేసింది. చై, సాయిపల్లవిపై చిత్రీకరించిన పలు సన్నివేశాలతో ఈ స్పెషల్‌ వీడియో రూపుదిద్దుకుంది. ఈ స్పెషల్‌ వీడియోపై సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. నాగచైతన్య నటన చాలా అద్భుతంగా, సహజంగా ఉందంటూ నాగార్జున, సమంతతోపాటు పలువురు మెచ్చుకున్నారు.

ఇదిలా ఉండగా ‘లవ్‌స్టోరీ’ స్పెషల్‌వీడియోకు సినీప్రియుల నుంచి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. విడుదల చేసిన కొద్దిసేపటికే రెండు మిలియన్ల వ్యూస్‌తో యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో దూసుకెళ్తోంది. టీజర్‌కు విశేషమైన స్పందన రావడంతో నాగచైతన్య.. శేఖర్‌ కమ్ములకు విలువైన కళ్లద్దాలను స్పెషల్‌ గిఫ్ట్‌గా అందించారు. దీనికి సంబంధించిన ఫొటోలను ట్విటర్‌ వేదికగా షేర్‌ చేసిన శేఖర్‌ కమ్ముల.. ‘స్పెషల్‌ గిఫ్ట్‌ అందించినందుకు థ్యాంక్యూ చై. గిఫ్ట్‌తో నన్ను టచ్‌ చేశావ్‌. నెక్ట్స్‌ టీజర్‌కి ఇంకో గిఫ్ట్‌ రెడీ చేసుకో’ అని పేర్కొన్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని