రష్మిక సీక్రెట్‌ బయట పెట్టిన నితిన్‌
close
Updated : 15/02/2020 20:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రష్మిక సీక్రెట్‌ బయట పెట్టిన నితిన్‌

హైదరాబాద్‌: ఈ భూ ప్రపంచంలో విభిన్న అభిరుచులు, అలవాట్లు ఉన్న జీవి ఏదైనా ఉందంటే అది మనిషి ఒక్కడే. కొందరికి మాంసాహారం లేనిదే ముద్ద దిగదు.. మరి కొందరు భోజనం చేసిన తర్వాత తప్పకుండా స్వీట్‌ తింటారు. ఇక సినీ తారలైతే అందంగా కనపడటం కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. వ్యాయామం, ఆహార నియమాల విషయంలో కఠినంగా ఉంటారు. పోషకాలున్న ఆహారాన్నే తీసుకునేందుకు ప్రాధాన్యం ఇస్తారు. కానీ, స్టార్‌ కథానాయిక రష్మికకు మాత్రం ఓ విచిత్రమైన అలవాటు ఉందట. ఆ అలవాటు ఏంటో తెలిస్తే అందరూ ఆశ్చర్యపోవాల్సిందే. 

ఇంతకీ ఆమెకున్న ఆ అలవాటు ఏంటో తెలుసా? బిస్కెట్లు తినడం.. బిస్కెట్లు తినడం అందరికీ అలవాటే కదా! ఇందులో విచిత్రం ఏముందనుకుంటున్నారా? అవి మనుషులు తినే బిస్కెట్లు కాదు.. కుక్క బిస్కెట్లు. నిజమేనా? అని ఆశ్చర్యపోకండి. ఈ విషయాన్ని రష్మికానే స్వయంగా వెల్లడించింది. నితిన్‌ సరసన ఆమె కథానాయికగా నటిస్తున్న తాజా చిత్రం ‘భీష్మ’. వెంకీ కుడుముల దర్శకుడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర ప్రచార కార్యక్రమంలో నితిన్‌తో కలిసి రష్మిక పాల్గొంది. ‘మీ గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పండి’ అని ప్రశ్నించగా, ఈ కుక్క బిస్కెట్ల రహస్యం బయకొచ్చింది. నితిన్‌ ఈ విషయాన్ని చెబుతుండగా, రష్మిక ఆయన నోరు నొక్కే ప్రయత్నం చేసింది.

‘‘ప్రతి విషయాన్ని నేను ఆసక్తిగా గమనిస్తా. నాకు ఒక కుక్క పిల్ల ఉంది. అది చాలా క్యూట్‌గా ఉంటుంది. ఇంత క్యూట్‌ ఉంటుంది కదా! ఇది తినే బిస్కెట్‌ తింటే ఎలా ఉంటుందో చూద్దామని జస్ట్‌ టేస్ట్‌ చేశానంతే.. అంత అసహ్యంగా ఏమీ లేదు’’ అని చెప్పుకొచ్చింది.  ప్రస్తుతం ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్‌లో ఉంది. 

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని