అభిమానులనుద్దేశిస్తూ రష్మిక ట్వీట్‌ 
close
Published : 17/02/2020 12:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అభిమానులనుద్దేశిస్తూ రష్మిక ట్వీట్‌ 

మీ వల్లే ఇదంతా జరిగింది

హైదరాబాద్‌: తన అభిమానులనుద్దేశిస్తూ యువ కథానాయిక రష్మిక సోషల్‌మీడియా వేదికగా ఓ ట్వీట్‌ పెట్టారు. కన్నడలో తెరకెక్కిన ‘కిర్రాక్‌పార్టీ’ చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఆమె మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ‘కిర్రాక్‌పార్టీ’ చిత్రం తర్వాత టాలీవుడ్‌, కన్నడ సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. తాజాగా ఆమె కథానాయికగా నటించిన 10వ చిత్రం ‘భీష్మ’. ఈ సినిమా ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఆమె అభిమానులు ట్విటర్‌ వేదికగా #Rashmika10onFeb21 అనే హ్యాష్‌ట్యాగ్‌తో రష్మిక నటించిన పలు పాత్రల ఫొటోలతో ట్విట్లు చేస్తున్నారు. దీంతో #Rashmika10onFeb21 అనే హ్యాష్‌ట్యాగ్‌ ట్విటర్‌ ఇండియా ట్రెండింగ్‌లోకి దూసుకెళ్లింది.

అభిమానులు పెట్టిన పలు ట్వీట్లపై స్పందించిన రష్మిక వారిని ఉద్దేశిస్తూ ఓ ప్రత్యేక ట్వీట్‌ పెట్టారు. ‘ఓ మై గాడ్‌!! అప్పుడే పదో సినిమానా? నాకు మాత్రం ఇంకా కొత్తగానే ఉంది. మీ మద్దతు నన్ను ఈ స్థాయికి తీసుకువచ్చింది. ఎన్నో విభిన్నమైన, మంచి పాత్రల్లో నటించినందుకు కాదు. కానీ మీలాంటి వారి మద్దతు పొందుతున్నందుకు దీనిని నేను సెలబ్రేట్‌ చేసుకుంటాను. లవ్ యూ’ అని రష్మిక పేర్కొన్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని