హరీశ్‌ శంకర్‌ ట్వీట్‌పై స్పందించిన పోలీసులు 
close
Published : 17/02/2020 13:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హరీశ్‌ శంకర్‌ ట్వీట్‌పై స్పందించిన పోలీసులు 

థ్యాంక్స్‌ చెప్పిన దర్శకుడు

హైదరాబాద్‌: తాను పెట్టిన ట్వీట్‌పై వెంటనే స్పందించి.. సమస్యను పరిష్కరించినందుకు టాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు హరీశ్‌ శంకర్‌ ట్విటర్‌ వేదికగా హైదరాబాద్‌ సిటీ పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. తాను నివాసం ఉండే జూబ్లీ ఎన్‌క్లేవ్స్‌ రెసిడెన్సీ పరిసరాల్లో అర్ధరాత్రి సమయంలో భారీ శబ్ధాలతో భవన నిర్మాణాలు చేపడుతున్నారని, దానివల్ల ఇబ్బందిగా ఉంటుందని తెలియచేస్తూ ఆదివారం రాత్రి ఓ ట్వీట్‌ పెట్టారు. ‘జీహెచ్‌ఎంసీ, హైదరాబాద్‌ సిటీపోలీస్‌.. జనావాస ప్రాంతాల్లో అర్ధరాత్రిపూట పెద్ద శబ్దాలతో భవన నిర్మాణాలు చేపట్టడానికి మీరు అనుమతినిచ్చారా..! న్యాయపరంగా ఫిర్యాదు చేయడానికంటే ముందు మీ సమాధానం తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే మీ ఆదేశాలను నేను పాటిస్తాను’ అని హరీశ్‌ శంకర్‌ ట్వీట్‌ చేశారు.

హరీశ్ శంకర్‌ పెట్టిన ట్వీట్‌పై స్పందించిన పోలీస్‌ అధికారులు ఆయన అడ్రస్‌ను అడిగి తెలుసుకుని పెట్రోలింగ్‌ సిబ్బందిని పంపించి.. భవన నిర్మాణ పనులను నిలిపివేయించారు. దీంతో హరీశ్‌ ట్విటర్‌ వేదికగా పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. ‘నేను నమ్మలేకపోతున్నాను. కొన్ని నిమిషాల్లోనే ఆ శబ్దాలు ఆగిపోయాయి. జూబ్లీ ఎన్‌క్లేవ్‌ రెసీడెన్సీలో నివాసముంటున్న వారందరి తరఫున ధన్యవాదాలు. మీరు తలుచుకుంటే ఏమైనా చేయగలరని.. ఎప్పుడైనా రాగలరని నిరూపించారు. నా వినతిని మన్నించి.. వెంటనే స్పందించి.. మా నమ్మకాన్ని నిలబెట్టి మేము మరింత బాధ్యతగా మెలిగేలా చేసినందుకు కృతజ్ఞతలు’ అని హరీశ్‌ శంకర్‌ పేర్కొన్నారు.
 


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని