ఆ హీరో అంటే క్రష్‌ : రష్మిక
close
Published : 18/02/2020 22:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ హీరో అంటే క్రష్‌ : రష్మిక

చెన్నై: రష్మిక మంథాన ఇటీవల టాలీవుడ్‌లో బాగా బిజీ అయిపోయిన హీరోయిన్‌. హీరో నితిన్‌తో కలిసి ఆమె నటించిన ‘భీష్మ’ త్వరలోనే అభిమానుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. తనకు తమిళ హీరో విజయ్‌ అంటే చాలా ఇష్టమని వెల్లడించింది. ‘చిన్నప్పట్నుంచీ విజయ్‌ సర్ అంటే క్రష్‌ ఉంది. ఆయనతో కలిసి బిగిల్‌ సినిమాలో నన్ను భాగస్వామి కావాలని చాలామంది కోరారు. అయితే, కొన్ని కారణాల వల్ల ఆ సినిమాలో చేయడం కుదరలేదు. ఆయనతో కలిసి పనిచేసే అవకాశం త్వరలోనే వస్తుందని అనుకుంటున్నాను’ అని ఆమె తెలిపింది.
2016లోనే కన్నడ సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన రష్మికకు అంతగా గుర్తింపు రాలేదు. 2018లో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టాక ఛలో, గీత గోవిందం సినిమాలతో ఈ భామ ఒక్కసారిగా స్టార్‌ హీరోయిన్‌గా మారిపోయింది. ఆ తర్వాత మహేష్‌బాబుతో ‘సరిలేరు నీకెవ్వరు’లో కనిపించిన  ఆమె ఇమేజ్‌ అమాంతం పెరిగిపోయింది. తెలుగుతో పాటు కన్నడ, తమిళంలోనూ ఆఫర్లు క్యూ కట్టడంతో ఆమె యమ బిజీ అయిపోయింది. త్వరలోనే కార్తీ హీరోగా వస్తున్న ‘సుల్తాన్‌’ సినిమాతో రష్మిక హీరోయిన్‌గా తమిళ ఇండస్ట్రీలోనూ రంగప్రవేశం చేయనుంది. మరోవైపు అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రంలోనూ రష్మిక హీరోయిన్‌గా ఛాన్స్‌ కొట్టేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని