నయన్‌తో పోటీ పడడానికి కారణమదే: సమంత 
close
Published : 20/02/2020 09:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నయన్‌తో పోటీ పడడానికి కారణమదే: సమంత 

‘కాత్తువక్కుల రెందు కాదల్‌’ గురించి నటి ఆసక్తికర వ్యాఖ్యలు

హైదరాబాద్‌: నయనతార ప్రియుడు విఘ్నేశ్‌ శివన్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న తమిళ చిత్రం ‘కాత్తువక్కుల రెందు కాదల్‌’. ముక్కోణపు ప్రేమకథగా తెరకెక్కనున్న ఈ సినిమాలో దక్షిణాదిలో అగ్రకథానాయికలుగా పేరుపొందిన నయనతార, సమంత కలిసి నటించనున్నారు. విజయ్‌ సేతుపతి ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన స్పెషల్‌ వీడియోను చిత్రబృందం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా సమంతను ఓ ఆంగ్లపత్రిక వారు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశారు.

‘కాత్తువక్కుల రెందు కాదల్‌’ సినిమా చేయడానికి గల కారణాన్ని గురించి సమంత ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆసక్తికరమైన, విభిన్నమైన కథల కోసం ఎదురుచూస్తున్న సమయంలో ‘కాత్తువక్కుల రెండు కాదల్‌’ సినిమా ఆఫర్‌ తన దగ్గరికి వచ్చిందని సమంత తెలిపారు. అంతేకాకుండా ఈ కథ తనకెంతగానో నచ్చిందని, నయనతార, విజయ్‌ సేతుపతి పక్కన ఉత్తమంగా నటించడం ఒక సవాలుగా భావించి ఈ కథకు ఓకే చెప్పానని ఆమె అన్నారు. త్వరలో ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుంది. అనిరుధ్‌ స్వరాలను అందించనున్నారు.

ఇటీవల విడుదలైన ‘జాను’ చిత్రంతో సమంత మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. తమిళంలో బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకున్న ‘96’ చిత్రానికి రీమేక్‌గా ‘జాను’ సినిమా తెరకెక్కింది. మాతృకను తెరకెక్కించిన సి.ప్రేమ్‌ కుమార్‌ ‘జాను’ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇందులో రామ్‌గా శర్వానంద్‌ నటన ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని