#GetWellSoonTHALA.. దాదాపు 83 వేల ట్వీట్లు 
close
Published : 19/02/2020 21:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

#GetWellSoonTHALA.. దాదాపు 83 వేల ట్వీట్లు 

హీరో అజిత్‌కు గాయాలు.. ట్విటర్‌లో అభిమానుల పోస్టులు

చెన్నై: కోలీవుడ్‌ ప్రముఖ నటుడు అజిత్‌కు షూటింగ్‌లో గాయాలైన విషయం తెలిసిందే. అజిత్‌ వెంటనే కోలుకోవాలంటూ అభిమానులు ట్విటర్‌ వేదికగా పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం అజిత్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘వాలిమై’. హెచ్‌.వినోద్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అజిత్‌ పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. బోనీకపూర్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం చెన్నైలో జరుగుతోంది. ఇందులో భాగంగా అజిత్‌పై కొన్ని బైక్‌ రైడ్‌ సీక్వెన్స్‌ను చిత్రీకరించారు. అయితే ఈ సీక్వెన్స్‌ను తెరకెక్కించే సమయంలో ప్రమాదవశాత్తూ అజిత్‌ ఒక్కసారిగా బైక్‌ నుంచి కిందపడ్డారు. ఈ ప్రమాదంలో ఆయనకుకు స్వల్పగాయాలయ్యాయి. దీంతో అజిత్‌ 30 నిమిషాలపాటు విరామం తీసుకుని తర్వాత తిరిగి షూటింగ్‌లో పాల్గొన్నారు.

ఇదిలా ఉండగా అజిత్‌కు గాయాలయ్యాయనే వార్త బయటకు రావడంతో ట్విటర్‌ వేదికగా అభిమానులు అజిత్‌ గురించి పోస్టులు పెడుతున్నారు. అజిత్‌ వెంటనే కోలుకోవాలంటూ వారు ప్రార్థనలు చేస్తున్నారు. #GetWellSoonTHALA అనే హ్యాష్‌ట్యాగ్‌తో దాదాపు 83 వేల ట్వీట్లు చేశారు. ప్రస్తుతం ట్విటర్‌ ఇండియా ట్రెండింగ్‌లో #GetWellSoonTHALA దూసుకెళ్తోంది.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని