భారతీయుడు-2 సెట్‌లో ప్రమాదం.. కాజల్‌ ట్వీట్‌  
close
Updated : 20/02/2020 14:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారతీయుడు-2 సెట్‌లో ప్రమాదం.. కాజల్‌ ట్వీట్‌  

ఆ క్షణం.. విలువ తెలిసింది

చెన్నై‌: ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌ కథానాయకుడిగా శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘భారతీయుడు-2’ సెట్‌లో బుధవారం రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నటి కాజల్‌ ట్విటర్‌ వేదికగా తన స్పందన తెలియజేశారు. ‘‘భారతీయుడు-2’ సెట్‌లో మాతోపాటు పనిచేసే కృష్ణ, చంద్రన్‌, మధును నిన్న రాత్రి జరిగిన ప్రమాదంలో కోల్పోవడం బాధగా ఉంది. నా గుండెలోని బాధను బయటపెట్టడానికి మాటలు రావడం లేదు. మృతిచెందిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. దేవుడు వారికి మరింత ధైర్యాన్నివ్వాలని ప్రార్థిస్తున్నాను’ అని ఆమె పేర్కొన్నారు. అనంతరం ఆమె మరో ట్వీట్‌ చేస్తూ.. ‘నిన్న రాత్రి జరిగిన క్రేన్‌ ప్రమాదంతో నేనింకా షాక్‌లోనే ఉన్నాను. కేవలం కొన్ని క్షణాల వ్యవధిలో నేను ప్రమాదం నుంచి తప్పించుకుని ఈరోజు మీకు ఇలా ట్వీట్‌ చేయగలిగాను. ఆ ఒక్కక్షణం.. నాకు కాలం, జీవిత విలువ తెలిసింది’ అని అన్నారు.

ప్రస్తుతం ‘భారతీయుడు-2’ షూటింగ్‌ చెన్నైలో జరుగుతోంది. అయితే షూటింగ్‌లో భాగంగా ఈవీసీ స్టూడియోలో లైటింగ్‌ కోసం సెట్‌ వేస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి 150 అడుగుల ఎత్తు నుంచి క్రేన్‌ తెగి చిత్రబృందం ఉండే టెంట్‌పై పడింది. ఈ ఘటనలో ముగ్గురు చనిపోగా, పదిమందికి తీవ్రగాయాలయ్యాయి. మృతుల్లో శంకర్‌ వ్యక్తిగత సహాయకుడు మధు(29), అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సాయికృష్ణ(34), సహాయకుడు చంద్రన్‌ ఉన్నారు

శంకర్‌ దర్శకత్వంలో 1996లో విడుదలై బ్లాక్‌బస్టర్‌ విజయం సాధించిన ‘భారతీయుడు’ చిత్రానికి కొనసాగింపుగా ‘భారతీయుడు-2’ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో కమల్‌హాసన్‌, సిద్ధార్థ్‌, కాజల్‌, రకుల్‌ ప్రీత్‌సింగ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇదీ చదవండి
భారతీయుడు-2 సెట్‌లో ఘోర ప్రమాదం




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని