శ్రీవారి సేవలో ‘భీష్మ’
close
Updated : 21/02/2020 14:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

శ్రీవారి సేవలో ‘భీష్మ’

తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని కథానాయకుడు నితిన్‌ దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయానికి వచ్చిన నితిన్‌కు తితిదే అధికారులు స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు.అనంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు.
నితిన్‌ తాజాగా నటించిన ‘భీష్మ’ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో నితిన్‌ స్వామివారి ఆశీస్సులు పొందారు. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నితిన్‌ సరసన రష్మిక నటించారు. అనంత్‌ నాగ్‌, నరేశ్‌ కీలక పాత్రలు పోషించారు. 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని