‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రానికి ఇద్దరు దర్శకులు 
close
Published : 23/02/2020 11:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రానికి ఇద్దరు దర్శకులు 

రెండో ఆయన ఎవరో గూగుల్‌కే తెలియాలి..!

హైదరాబాద్‌: టాలీవుడ్‌లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాకు దర్శకుడు ఎవరంటే సినీ ప్రియులెవరైనా రాజమౌళి అని టక్కున చెబుతారు. కానీ గూగుల్‌ మాత్రం రాజమౌళితోపాటు మరో వ్యక్తి పేరు కూడా చూపిస్తోంది. అసలు విషయం ఏమిటంటే.. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ప్రధాన పాత్రల్లో రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి గూగుల్‌లో సెర్చ్‌ చేస్తే.. దర్శకత్వం స్థానంలో రాజమౌళి పేరుతో పాటు సంజయ్‌ పాటిల్‌ అనే వ్యక్తి పేరు కూడా కనిపిస్తోంది. సంజయ్‌పాటిల్‌ గురించి సెర్చ్‌ చేస్తే ఎలాంటి సమాచారం చూపించడం లేదు. ఇది చూసిన అభిమానులు ఒకింత ఆశ్చర్యానికి గురి అవుతున్నారు. అంతేకాకుండా సంజయ్‌ పాటిల్‌ ఎవరో గూగుల్‌కే తెలియాలని అనుకుంటున్నారు.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలో రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా,  ఎన్టీఆర్‌ కొమరంభీమ్‌గా కనిపించనున్నారు. ఇందులో రామ్‌చరణ్‌కు జంటగా ఆలియా భట్‌, ఎన్టీఆర్‌కు జంటగా హలీవుడ్‌ నటి ఒలీవియా మోరిస్‌ నటిస్తున్నారు. బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ ఈ సినిమాలో ఓ కీలకపాత్రలో కనిపించనున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 8న ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రానుంది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని