అతడితోనే నా పెళ్లి: అనుష్క
close
Updated : 24/02/2020 09:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అతడితోనే నా పెళ్లి: అనుష్క

ముంబయి: సినిమా ఇండస్ట్రీలో హీరోహీరోయిన్ల సినిమాల విషయంలో అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తారో.. వారి పెళ్లి గురించి వార్తలు వచ్చినప్పుడు అంతకంటే ఎక్కువగా ఆసక్తి కనబరుస్తారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచులర్స్‌ చాలా మందే ఉన్నారు. హీరోయిన్ల గురించి చెప్పుకోవాల్సి వస్తే మొదట వరుసలో ఉండేది మన స్వీటీ అనుష్క అనడంలో సందేహం అవసరం లేదు. గతంలో ప్రభాస్‌ను ఈ భామ పెళ్లి చేసుకుంటున్నట్లు ప్రచారం జరిగింది. అప్పట్లో ఆ ప్రచారాన్ని ఆమె కొట్టిపారేసినా తర్వాత ఆమె పెళ్లి గురించి ప్రచారం గుసగుసలు మాత్రం ఆగలేదు. అయితే తాజాగా ఆమె తన పెళ్లిపై ఓ క్లారిటీ ఇచ్చింది.

అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ‘నిశ్శబ్దం’ సినిమా ప్రచారంలో భాగంగా ఆమె పలు విషయాలు అభిమానులతో పంచుకుంది. ‘నేను పెద్దవాళ్లు చూపించిన వాడినే పెళ్లి చేసుకుంటా. ప్రస్తుతం ఎవరితోనూ ప్రేమలో లేను. నేను ప్రేమలో ఉన్నట్లు తరచూ వార్తలు వినిపిస్తుంటాయి. అవి నాకు చాలా బాధకలిగిస్తాయి. అలాంటి వార్తల్లో ఏమాత్రం నిజం లేదు’ అని పేర్కొంది. అనుష్క మూగ అమ్మాయిగా నటించిన ‘నిశ్శబ్దం’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వం వహించారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని