తమన్‌ ట్వీట్‌ పింక్‌ రీమేక్‌ గురించేనా..?
close
Published : 24/02/2020 22:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తమన్‌ ట్వీట్‌ పింక్‌ రీమేక్‌ గురించేనా..?

హైదరాబాద్‌: ‘అల వైకుంఠపురములో’ సినిమాతో సంగీత దర్శకుడు తమన్‌ స్థాయి అమాంతం పెరిగిపోయింది. తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచిందీ సినిమా. ఈ నేపథ్యంలో తమన్‌ ఓ అగ్రనటుడి సినిమాలో తన తొలిపాటతో త్వరలో అభిమానుల ముందుకు వస్తున్నట్లు ట్విటర్‌లో పోస్టు పెట్టారు. ‘నేను ఎవరితోనైతే కలిసి పనిచేయాలని కలలు కన్నానో ఆ హీరోను కలిశాను. నేను కంపోజ్‌ చేసిన మ్యూజిక్‌ను ఆయనకు వినిపించాను. ఆ సమయంలో బాగా టెన్షన్‌కు గురయ్యా. మొత్తానికి త్వరలోనే ఆయన సినిమాలోని తొలి పాటతో మీ ముందుకు వస్తున్నా’ అని ట్విటర్‌లో తమన్‌ పేర్కొన్నాడు. పవన్‌కల్యాణ్‌ నటిస్తున్న ‘పింక్‌’ రీమేక్‌ నుంచి తొలి పాటను విడుదల చేస్తున్నట్లు తమన్‌ హింట్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ సినిమాను వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. దిల్‌రాజు నిర్మాత. కాగా ఈ చిత్రానికి ‘వకీల్‌సాబ్‌’ అనే టైటిల్‌ అనుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటనా విడుదల కాలేదు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని