అనుమతి లేకుండా కమల్‌ నన్ను ముద్దు పెట్టుకున్నారు  
close
Updated : 26/02/2020 13:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అనుమతి లేకుండా కమల్‌ నన్ను ముద్దు పెట్టుకున్నారు  

ఇప్పుడు దాని గురించి మాట్లాడాలని లేదు: రేఖ

చెన్నై: ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌, రేఖ జంటగా నటించిన ప్రేమకావ్యం ‘పున్నగై మన్నన్‌’. కె.బాలచందర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా 1986లో విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో కమల్‌-రేఖ మధ్య ఓ ముద్దు సన్నివేశాన్ని కె.బాలచందర్‌ చిత్రీకరించారు. అయితే ఇటీవల రేఖ ‘పున్నగై మన్నన్‌’ సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన అనుమతి తీసుకోకుండానే బాలచందర్‌ చెప్పినదాని ప్రకారం కమల్‌హాసనన్‌ తనని ముద్దు పెట్టుకున్నారని రేఖ తెలిపారు. ఒకవేళ ముద్దు సన్నివేశం గురించి ముందే చెప్పి ఉంటే తాను అంగీకరించేదాన్ని కాదని ఆమె ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రస్తుతం రేఖకు సంబంధించిన ఈ ఇంటర్వ్యూ వీడియో నెట్టింట్లో వైరల్‌ కావడంతో కమల్‌హాసన్‌ వెంటనే రేఖకు క్షమాపణలు చెప్పాలంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

దీనిపై స్పందించాలని ఓ ఆంగ్ల పత్రిక రేఖను కోరగా... ‘నాకు చెప్పడానికి ఏం లేదు. ‘పున్నగై మన్నన్‌’ సినిమా గురించి ఇప్పుడు సోషల్‌మీడియాలో ఎందుకు అంత పాపులర్‌ అయ్యిందో అర్థం కావడం లేదు. ఎన్నో సంవత్సరాల క్రితం అది జరిగింది. నా అంగీకారం లేకుండానే వాళ్లు ముద్దు సన్నివేశాన్ని చిత్రీకరించినప్పటికీ అది సినిమాకి ఎంతగానో ఉపయోగపడింది. ఇప్పుడు దాని గురించి మాట్లాడి పాపులారిటీని పొందాలనుకోవడం లేదు. నేను ప్రస్తుతం సినిమాలు, వెబ్‌ సిరీస్‌లలో నటిస్తూ చాలా బిజీగా ఉన్నాను. అంతేకాకుండా నాకు ఇంకా చాలా బాధ్యతలు ఉన్నాయి’ అని రేఖ తెలిపారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని