నాలుగేళ్ల నిరీక్షణ తర్వాత దక్కిన విజయమిది
close
Published : 26/02/2020 10:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నాలుగేళ్ల నిరీక్షణ తర్వాత దక్కిన విజయమిది

- నితిన్‌

‘‘నాలుగేళ్ల నిరీక్షణ తర్వాత ‘భీష్మ’ రూపంలో విజయం దక్కింది. ఈ విజయంతో దర్శకుడు వెంకీ కుడుముల ఎంతోమందికి జవాబు చెప్పాడ’’న్నారు నితిన్‌. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘భీష్మ’. వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. రష్మిక కథానాయిక. సూర్యదేవర నాగవంశీ నిర్మాత. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిందీ చిత్రం. మంగళవారం హైదరా బాద్‌లో విజయోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నితిన్‌ మాట్లాడుతూ ‘‘నితిన్‌ బాగా నవ్వించాడు, బాగా  నటించాడు అంటుంటే సంతోషంగా ఉంది. నిజానికి నేను చేసింది వెంకీని కాపీ కొట్టడమే. తను ఈ చిత్రం కోసం బాగా కష్టపడ్డాడు. ‘ఛలో’తో వెంకీకి విజయాన్నిచ్చిన రష్మిక, ఇప్పుడీ చిత్రంలోనూ భాగమైంది. నా కెరీర్‌లో మరిచిపోలేని ‘అఆ’  ఈ సంస్థ నుంచే వచ్చింది. ఇప్పుడు మరో విజయం ఇక్కడే దక్కింది. ఈ సంస్థలో మరిన్ని సినిమాలు చెయ్యాలని  కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘తొలి చిత్రం ‘ఛలో’తో విజయాన్ని అందుకున్న వెంకీ, ‘భీష్మ’తోనూ ఆ పరంపరని కొనసాగించాడు. తర్వాత చిత్రంతో హ్యాట్రిక్‌ సాధించాలని కోరుకుంటున్నా.  సినిమాలో కథ, వినోదం బలంగా ఉంటే ప్రేక్షకులు విజయవంతం చేస్తారనడానికి ఈ చిత్రం ఓ మంచి ఉదాహరణ’’ అన్నారు దిల్‌రాజు. వెంకీ కుడుముల మాట్లాడుతూ ‘‘అందరి ప్రోత్సాహంతో సినిమాను అనుకున్న విధంగా తియ్యగలిగా. ఈ సినిమాలో నటించి రష్మిక స్నేహానికి మరింత విలువ ఇచ్చింద’’న్నారు. ‘‘ఇందులో నాకొక మంచి పాత్ర ఇచ్చినందుకు వెంకీకి రుణపడి ఉంటాను. ‘భీష్మ’ పాత్రలో నితిన్‌ను చూసి ఆయనకు అభిమానినైపోయా. సంగీతం, ఛాయాగ్రహణం చక్కగా కుదిరిన చిత్రమిది’’ అన్నారు రష్మిక. ఈ కార్యక్రమంలో మహతి స్వరసాగర్‌, ఎస్‌.రాధాకృష్ణ, కాసర్లశ్యామ్‌, శ్రీమణి తదితరులు పాల్గొన్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని