సీరియస్‌గా తీసుకోవాలి..
close
Published : 26/02/2020 21:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సీరియస్‌గా తీసుకోవాలి..

ముంబయి: ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద మరోసారి మహిళల వేధింపుల గురించి స్పందించారు. ‘పున్నగై మన్నన్‌’ సినిమా చిత్రీకరణ సందర్భంగా నటుడు కమల్‌ హాసన్‌ తన అనుమతి తీసుకోకుండానే అకస్మాత్తుగా తనను ముద్దుపెట్టుకున్నారని నటి రేఖ ఇటీవల వెల్లడించారు. ఒకవేళ తనను ముందే అడిగి ఉంటే తాను అందుకు అంగీకరించేదాన్ని కాదని ఆమె స్పష్టం చేశారు. దీంతో ఆ సినిమాలోని ముద్దు సన్నివేశం వీడియో కాస్తా వైరల్‌ అయింది. సాధారణంగా స్త్రీలపై వేధింపుల విషయాల్లో సామాజిక మాధ్యమాల వేదికగా తన గొంతు వినిపించే చిన్మయి ఈ ఘటనపై ట్విటర్‌ వేదికగా స్పందించారు.
‘సినిమా షూటింగ్‌ సమయాల్లో మహిళలను శారీరకంగా వేధించే శాడిస్టులు ఇంకా ఉన్నారు. కొంతమంది సినిమా సెట్లో పరిస్థితులను అప్పటికప్పుడు తమకు అనుకూలంగా మార్చుకొని మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తుంటారు. అయితే, రేఖ గారి విషయంలో జరిగిన ఈ సంఘటనను ఆమె చాలా సాధారణంగా తీసుకున్నారు. ఆమె ఇంటర్వ్యూ ఎపిసోడ్‌ మొత్తం చూశాను. ఆ విషయాలన్నీ ఆమె నవ్వుతూ చెప్పారు. అంటే ఆ ముద్దు సంఘటనను ఆమె సాధారణంగా తీసుకున్నారు. అందుకే అనుమతి లేకుండా ముద్దు పెట్టినప్పటికీ ఆ సమయంలో ఎవర్నీ ఏమీ అనలేకపోయింది. చాలామంది ఇలాంటి వాటిని సాధారణంగా భావించి అక్కడికక్కడే మరిచిపోతున్నారు. అయితే మహిళలు సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉంది’ అని చిన్మయి అభిప్రాయం వ్యక్తం చేశారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని