అతనితో సరితూగాలంటే.. 4 కుర్చీలు కావాలి
close
Published : 26/02/2020 21:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అతనితో సరితూగాలంటే.. 4 కుర్చీలు కావాలి

ముంబయి: అయాన్‌ముఖర్జీ దర్శకత్వంలో బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌ నటిస్తున్న చిత్రం బ్రహ్మాస్ర్త. షూటింగ్‌ శరవేగంగా జరుపుకొంటోంది. ఇందులో భాగంగా బుధవారం అమితాబ్‌ షూటింగ్‌లో పాల్గొని సందడి చేశారు. ఈ చిత్రంలో అమితాబ్‌తో పాటు రణ్‌బీర్ కపూర్‌, అలియా భట్‌ నటించగా కింగ్‌ నాగార్జున కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇదిలా ఉండగా అమితాబ్‌ తాను షూటింగ్‌లో పాల్గొన్న ఫొటోలను ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. 
‘నా అభిమాన నటుడు రణ్‌బీర్‌తో షూటింగ్‌లో పాల్గొన్నాను. 
అతను ఎంతో సత్తా ఉన్న నటుడు. అతనితో సరితూగాలంటే నాకు 4 కుర్చీలు కావాల్సి వచ్చింది’ అని ట్వీటారు.
ఈ చిత్రం డిసెంబర్‌ 4న ప్రేక్షకుల ముందు రానుంది. కాగా ఆయన నటించిన ‘ఝుండ్‌’ విడుదలకు సిద్ధంగా ఉంది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని