థియేటర్లు దొరక్క విడుదల వాయిదా
close
Published : 27/02/2020 22:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

థియేటర్లు దొరక్క విడుదల వాయిదా

చెన్నై: త్రిష ప్రధాన పాత్రలో నటించిన తమిళ చిత్రం పరమపదం విలయవట్టు. ఫిబ్రవరి 28న విడుదల కావాల్సిన ఈ చిత్రం కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. అనుకున్న సంఖ్యలో థియేటర్లు దొరక్కపోవడం వల్లే సినిమా విడుదలను వాయిదా వేసినట్లు చిత్రబృందం ట్విటర్‌ వేదికగా ప్రకటించింది. ఈ సినిమాను మార్చిలో అభిమానుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర బృందం యోచిస్తోంది. విడుదలకు సంబంధించి త్వరలోనే ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

ఈ సినిమాతో యువ డైరెక్టర్‌ తిరుజ్ఞానం కోలీవుడ్‌కు దర్శకుడిగా పరిచయం కానున్నాడు. ఈ చిత్రంలో త్రిష వైద్యురాలైన తల్లి పాత్రలో కనిపించనుంది. మనస్వి, అజగప్పన్‌, నంద, రిచర్డ్‌ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాను డీఎంవై క్రియేషన్స్‌ నిర్మిస్తోంది. అమృత్‌ సంగీతం అందించారు. మరోవైపు సినిమా ప్రచార కార్యక్రమాల్లో త్రిష పాల్గొనకపోవడంతో ఆమె తీసుకున్న పారితోషికం తిరిగి వెనక్కి ఇవ్వాలని నిర్మాణ సంస్థ త్రిషను కోరినట్లు తెలుస్తోంది. అభిమానులు త్రిషను చూసే సినిమాకు వస్తారని, పైగా ఈ చిత్రంలో హీరో కూడా లేరని నిర్మాణ సంస్థ పేర్కొంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని