ట్రెండింగ్‌లో పవన్‌ ఫస్ట్‌లుక్‌ 
close
Published : 29/02/2020 12:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ట్రెండింగ్‌లో పవన్‌ ఫస్ట్‌లుక్‌ 

మార్చి8న ఫస్ట్‌ సాంగ్‌..!

హైదరాబాద్‌: పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌.. దాదాపు రెండేళ్ల నుంచి థియేటర్‌లో ఆయన బొమ్మ చూడాలని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించిన ‘అజ్ఞాతవాసి’ తర్వాత రాజకీయాలపై దృష్టి సారించి సినిమాల నుంచి కొంత విరామం తీసుకున్న ఆయన తాజాగా వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం పవన్‌ ప్రధాన పాత్రలో వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌, తాప్సీ కీలకపాత్రల్లో నటించిన ‘పింక్‌’ సినిమాకు రీమేక్‌గా పవన్‌ సినిమా రానుంది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వేసవి కానుకగా మే నెలలో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

పవన్‌కల్యాణ్‌ 26వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో ఎంతో ఆసక్తి నెలకొని ఉంది. ఈ సినిమా అప్‌డేట్స్‌ కోసం అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్న తరుణంలో చిత్ర సంగీత దర్శకుడు తమన్‌.. ‘PSPK26FirstSingle’ను త్వరలోనే విడుదల చేస్తామని ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజాగా అభిమానులు పవన్‌ ఫస్ట్‌లుక్‌ గురించి సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మార్చి 2 పవన్‌ సినిమా ఫస్ట్‌లుక్‌, మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్చి 8న ఫస్ట్‌సాంగ్‌ను విడుదల చేయనున్నారంటూ నెటిజన్లు పేర్కొంటున్నారు. దీంతో ప్రస్తుతం #PSPK26FirstLook అనే హ్యాష్‌ట్యాగ్‌ ట్విటర్‌ ట్రెండింగ్‌లో దూసుకెళ్తోంది. మరోవైపు ఈ సినిమాకి ‘వకీల్‌సాబ్‌’ అనే పేరు ప్రచారంలో ఉంది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని