అంచనాలను అందుకున్నవి కొన్ని మాత్రమే!
close
Published : 29/02/2020 17:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అంచనాలను అందుకున్నవి కొన్ని మాత్రమే!

ఈ ఏడాది జనవరి నెలలో బాక్సాఫీస్‌ కళకళలాడింది. సంక్రాంతి, గణతంత్ర దినోత్సవం సందర్భంగా వచ్చిన చిత్రాలు మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. ఆ జోరును కొనసాగిస్తూ ఫిబ్రవరి నెలలో కూడా పలు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మరి ఫిబ్రవరిలో విడుదలైన సినిమాలు ప్రేక్షకులను ఏ మేరకు అలరించాయి? 

భావోద్వేగాల జాను

ర్వానంద్‌, సమంత కీలక పాత్రల్లో సి. ప్రేమ్‌కుమార్‌ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘జాను’. తమిళ చిత్రం ‘96’కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ‘జాను’ కేవలం కొన్ని వర్గాల ప్రేక్షకులను మాత్రమే అలరించింది. దీని కారణం అందరూ ఈ చిత్రాన్ని ‘96’తో పోల్చి చూడటమే. తమిళంలో మంచి విజయాన్ని అందుకున్న ఈ తెలుగులో మాత్రం ఓ ఫీల్‌గుడ్‌ మూవీగా మాత్రమే పేరుతెచ్చింది. శర్వా, సమంతలు తమ నటనతో యువ ప్రేక్షకులను మెప్పించారు. 

3 మంకీస్‌

‘జ‌బ‌ర్దస్త్’ ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల్ని న‌వ్వించి, పాపుల‌ర్ అయ్యారు సుడిగాలి సుధీర్‌, గెట‌ప్ శ్రీ‌ను, రాంప్ర‌సాద్‌. ఈ ముగ్గురూ క‌లిసి చేసిన సినిమా ‘త్రీ మంకీస్’. క్రైమ్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో తెరకెక్కిన ఈ సినిమా కూడా బాక్సాఫీస్‌ వద్ద మెప్పించలేకపోయింది. ‘జబర్దస్త్‌’ ఇష్టపడేవాళ్లకు మాత్రం ఈ సినిమాలో పంచ్‌లు అలరించాయి. మరికొన్ని హాస్య సన్నివేశాలపై దృష్టి పెట్టి ఉంటే ఇంకాస్త బాగుండేది. 

వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌

ఫిబ్రవరిలో ‘జాను’ తర్వాత అందరికీ ఆకర్షించిన చిత్రం ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’. ‘అర్జున్‌రెడ్డి’తో క్రేజ్‌ తెచ్చుకున్న యువ కథానాయకుడు విజయ్‌ దేవరకొండ నటిస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే, వెండితెరపై మాత్రం ఆ అంచనాలను అందుకోవడం ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ తడబడ్డాడు.  క్రాంతిమాధ‌వ్ ర‌చ‌యిత‌గా త‌న క‌లం బ‌లాన్ని ప్రద‌ర్శించారు. ఒక ప్రేమ‌క‌థ‌కి మ‌రో రెండు క‌థ‌ల్ని జోడించి చెప్పడం ఆక‌ట్టుకుంటుంది. రచ‌యిత‌గా మ‌రోసారి త‌న ప్రతిభ‌నైతే చూపెట్టాడు కానీ.. ద‌ర్శకుడిగా మాత్రం ఆయ‌న పూర్తిస్థాయిలో సినిమాపై ప‌ట్టుని ప్రద‌ర్శించ‌లేక‌పోయారు.

ప్రెజర్‌ కుక్కర్‌

మెరికా వెళ్లాల‌నుకున్న వాళ్లు ఎన్ని అగ‌చాట్లు ప‌డుతున్నారో, అక్క‌డ‌కి వెళ్లాక ఎలా మారిపోతున్నారో, వాళ్ల‌కు దూర‌మైన త‌ల్లిదండ్రులు ఎంత ఆవేద‌నకు గుర‌వ‌తున్నారో చెప్పే క‌థ ‘ప్రెజర్‌ కుక్కర్’. సాయి రోనక్‌, ప్రీతి అష్రనీ, తనికెళ్ల భరణి, రాహుల్‌ రామకృష్ణ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం అంతగా మెప్పించలేకపోయింది. క‌థలోని ప్ర‌తి స‌న్నివేశ‌మూ, ప్ర‌తి సంద‌ర్భమూ అమెరికా  అనే పాయింటు చుట్టూనే తిరగడం, ప్ర‌తీ పాత్రా అమెరికా జ‌పం చేయ‌డంతో విసుగు  తెప్పిస్తుంది. ద‌ర్శ‌కులు సుజోయ్‌, సుశీల్‌లు మంచి క‌థ‌నే ఎంచుకున్నా జ‌న‌రంజ‌కంగా చెప్ప‌లేక‌పోయారు. 

ఫిబ్రవరి నెల నితిన్‌దే

రుస అపజయాలతో సతమతమవుతున్న నితిన్‌ను ఈ ఏడాది అద్భుతమైన గిఫ్ట్‌లు లభించాయి. త్వరలో పెళ్లి పీటలెక్కనుండగా, ఫిబ్రవరిలో ‘భీష్మ’తో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. వెంకీ కుడుముల దర్శకత్వంలో వచ్చి ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఒక విధంగా చెప్పాలంటే ఫిబ్రవరి బాక్సాఫీస్‌ కింగ్‌ నితిన్‌. హాస్యం, రష్మిక అందాలు, కథలో మలుపులు సినిమాను యువతకు దగ్గర చేశాయి. 

క‌నులు క‌నులను దోచాయంటే

క ఈ నెలలో చివరిగా వచ్చిన వాటిలో డబ్బింగ్‌ చిత్రం క‌నులు ‘క‌నులను దోచాయంటే’ ఒకటి. దుల్కర్‌ సల్మాన్‌, రీతూవర్మ జంటగా నటించిన ఈ చిత్రం థ్రిల్లర్‌ కోరుకునే ప్రేక్షకులను మెప్పించింది. కథలో మ‌లుపులు, ఉత్కంఠ స‌గ‌టు క్రైమ్ క‌థా చిత్రాల ప్రియులకు భిన్నమైన అనుభ‌వాన్ని పంచింది. 

‘హిట్‌’తో హిట్‌ కొట్టారు 

‘ఫలక్‌నుమా దాస్‌’తో అందరి దృష్టిని ఆకర్షించిన విశ్వక్‌సేన్‌ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘హిట్‌’. నాని నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం  మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా విశ్వక్‌సేన్‌ నటన, నేర పరిశోధన, కథలో మలుపులు అలరించాయి. కాకపోతే కథ మొత్తం నేర పరిశోధన చుట్టూనే తిరుగుతుండటంతో కొన్ని సన్నివేశాలు పునరావృతం అవుతున్నాయా? అనిపిస్తుంది. అయితే, థ్రిల్లర్ క‌థ‌ల్ని ఇష్టప‌డేవాళ్లకి మాత్రం ‘హిట్‌’ తప్పకుండా నచ్చుతుంది.

రాహు

కృతిగార్గ్, అభిరామ్‌ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘రాహు’. సుబ్బు వేదుల దర్శకత్వం వహించిన ఈ చిత్రం రొమాంటిక్‌ థ్రిల్లర్‌గా పర్వాలేదనిపించింది. కృతిగార్డ్‌ నటన, పతాక సన్నివేశాలు ప్రేక్షకులను మెప్పించాయి. కథ పరంగా ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుని ఉంటే తప్పకుండా మరో విజయవంతమైన చిత్రమయ్యేది. కానీ, థ్రిల్లర్‌ ప్రేక్షకులకు మాత్రం ఇది కూడా నచ్చుతుంది. 

క వీటితో పాటు, తెలుగులో ‘సవారీ’, ‘డిగ్రీ కాలేజ్‌’, ‘నీవల్లే నేనున్నా’, ‘ఒక చిన్న విరామం’, ‘శివ 143’, లైఫ్‌ అనుభవించు రాజా’, ‘వలయం’, చీమ ప్రేమ, మధ్యలో భామ’, ‘స్వేచ్ఛ’ చిత్రాలు విడుదల కాగా,  బాలీవుడ్‌ నుంచి ‘మలంగ్‌’, ‘లవ్‌ ఆజ్‌కల్‌’, ‘థప్పడ్‌’ తదితర చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. 

-ఇంటర్నెట్‌డెస్క్‌మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని