ఆయన ఎప్పటికీ ఎంజీఆర్‌ కాడు.. కాలేడు..!
close
Published : 29/02/2020 19:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆయన ఎప్పటికీ ఎంజీఆర్‌ కాడు.. కాలేడు..!

సూపర్‌స్టార్‌పై దర్శకుడి ఘాటు వ్యాఖ్యలు

చెన్నై: సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయ ప్రవేశంపై దర్శకుడు, నటుడు ఆర్‌. సుందర్‌ రాజన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘రజనీ ఎప్పటికీ ఎంజీఆర్‌ కాలేడు’ అని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత 72వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సుందర్‌ రాజన్‌ పాల్గొన్నారు. ఈ క్రమంలో రజనీ రాజకీయాల్లోకి రాబోతుండటంపై ఘాటుగా విమర్శలు గుప్పించారు. ‘ఓ టీచర్‌ ముఖ్యమంత్రి అయితే మిగిలిన టీచర్లు సంతోషపడతారు. అంతేకానీ అదే మార్గంలో వెళ్లి.. వాళ్లు కూడా ముఖ్యమంత్రి కావాలని అనుకోరు. ఎంజీఆర్‌ ముఖ్యమంత్రి అయినప్పుడు అందరూ నటులు తమ అర్హతతో సంబంధం లేకుండా నటులు కావాలి అనుకున్నారు. రజనీ’ అన్నారు.

అనంతరం రజనీని, ఎంజీఆర్‌తో పోల్చుతూ.. ‘ఎంజీఆర్‌ తన సినిమాల్లో ఎప్పుడూ విలన్‌ను చంపలేదు. రజనీ, విజయ్‌, అజిత్‌.. వీరు సినిమా చివర్లో విలన్‌ను శిక్షిస్తుంటారు. ఓ రాజు వేషం వేయాలంటే అది ఎంజీఆర్‌కే సాధ్యం. ఆ పాత్రను రజనీ, విజయ్‌, అజిత్‌.. మరెవరైనా వేస్తే చూడలేం. అలాంటప్పుడు ఆయన కూర్చున్న సింహాసనాన్ని వీరెలా కోరుకుంటారు..?’ అని సుందర్‌ విమర్శలు గుప్పించారు. ఆయన తన ప్రసంగంలో ఉదయనిధి స్టాలిన్‌, స్టాలిన్‌, డీఎంకే పార్టీని కూడా తప్పబట్టడం గమనార్హం.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని