రాహుల్‌ సిప్లిగంజ్‌పై బీరు సీసాలతో దాడి
close
Updated : 05/03/2020 09:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రాహుల్‌ సిప్లిగంజ్‌పై బీరు సీసాలతో దాడి

తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చేరిన బిగ్‌బాస్‌-3 విజేత
  పబ్బులో ఘర్షణే కారణం

గచ్చిబౌలి : బిగ్‌బాస్‌-3 విజేత, గాయకుడు రాహుల్‌ సిప్లిగంజ్‌పై హైదరాబాద్‌లోని ఓ పబ్బులో బుధవారం రాత్రి దాడి జరిగింది. తలపై బీరుసీసాలతో కొట్టడంతో తీవ్ర రక్తస్రావమైంది. గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రాహుల్‌ సిప్లిగంజ్‌ తన స్నేహితులు, ఓ స్నేహితురాలితో కలిసి గచ్చిబౌలిలోని ఓ పబ్‌కు బుధవారం రాత్రి 11.45 గంటలప్పుడు వచ్చారు. కొంతమంది యువకులు రాహుల్‌ వెంట వచ్చిన యువతి పట్ల అనుచితంగా ప్రవర్తించారు. రాహుల్‌ వారిని నిలదీయడంతో మాటామాటా పెరిగింది. అరగంట తర్వాత ఇరువర్గాలు పరస్పరం దాడులకు దిగాయి. ఒక దశలో యువకులు రాహుల్‌ను బీరు సీసాలతో కొట్టారు. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. దాడికి పాల్పడిన వారిలో వికారాబాద్‌ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే సోదరుడు ఉన్నట్లు సమాచారం.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని