రాహుల్‌ దాడి ఘటన: కేసు నమోదు
close
Published : 05/03/2020 13:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రాహుల్‌ దాడి ఘటన: కేసు నమోదు

హైదరాబాద్‌: బిగ్‌బాస్‌-3 విజేత, గాయకుడు రాహుల్‌ సింప్లిగంజ్‌పై దాడి ఘటనలో కేసు నమోదు చేసినట్లు గచ్చిబౌలి సీఐ శ్రీనివాస్‌ తెలిపారు. పబ్‌లో లభించిన వీడియోల ఆధారంగా కేసు నమోదు చేశామన్నారు. రితేశ్‌రెడ్డితో పాటు మరో ఆరుగురు రాహుల్‌పై బీరు సీసాలతో దాడి చేశారని తెలిపారు. నృత్యం చేస్తున్న సమయంలో రాహుల్‌ను కొంతమంది తాకారు... దీంతో వారి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణ చోటుచేసుకొందని వివరించారు. దాడి ఘటనపై రాహుల్‌ ఫిర్యాదు చేయలేదని, పబ్‌ యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు చెప్పారు. దాడి ఘటన అనుకోకుండా జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు.

పబ్‌లో ఏం జరిగిందంటే?
రాహుల్‌ సిప్లిగంజ్‌ తన స్నేహితులు, ఓ స్నేహితురాలితో కలిసి గచ్చిబౌలిలోని ఓ పబ్‌కు బుధవారం రాత్రి 11.45 గంటలప్పుడు వచ్చారు. కొంతమంది యువకులు రాహుల్‌ వెంట వచ్చిన యువతి పట్ల అనుచితంగా ప్రవర్తించారు. రాహుల్‌ వారిని నిలదీయడంతో మాటామాటా పెరిగింది. అరగంట తర్వాత ఇరువర్గాలు పరస్పరం దాడులకు దిగాయి. ఒక దశలో యువకులు రాహుల్‌ను బీరు సీసాలతో కొట్టారు. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. దాడికి పాల్పడిన వారిలో వికారాబాద్‌ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే సోదరుడు ఉన్నట్లు సమాచారం. గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో రాహుల్‌ చికిత్స పొందుతున్నారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని