న్యాయం జరగాలి: రాహుల్‌ సిప్లిగంజ్‌
close
Updated : 05/03/2020 17:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

న్యాయం జరగాలి: రాహుల్‌ సిప్లిగంజ్‌

కేసు విత్‌డ్రా చేసుకునే ఆలోచనే లేదు!

హైదరాబాద్‌: తనపై జరిగిన దాడి ఘటనలో న్యాయం జరుగుతుందని నమ్ముతున్నానని గాయకుడు, బిగ్‌బాస్‌-3 విజేత రాహుల్‌ సిప్లిగంజ్‌ అన్నారు. తనపై దాడి ఘటనకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తొలుత వాళ్లే అసభ్య పదజాలంతో తనని తిట్టారని, అలా ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించినందుకే తనపై దాడి చేశారని రాహుల్‌ తెలిపారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. 

మీ మీద ఎలా దాడి జరిగింది?

రాహుల్‌ సిప్లిగంజ్‌: నాపై దాడికి ముందుకు వాళ్లు వాష్‌ రూమ్‌కు వెళ్లి తిరిగి వస్తూ అసభ్య పదజాలంతో కామెంట్‌ చేస్తూ డాష్‌ ఇచ్చారు. వెంటనే ఒకతని చేయి పట్టుకుని ఆపేందుకు ప్రయత్నించగా తోసేశాడు. సర్లే మనకెందుకులే అని నేను కూడా ఏమీ మాట్లాడకుండా ఉండిపోయా. కొద్దిసేపు అయిన తర్వాత వాళ్లు నన్ను తిట్టడం మొదలు పెట్టారు. ‘నన్నెందుకు తిడుతున్నారు’ అని వెళ్లి ప్రశ్నిస్తే అందరూ ఒక్కసారిగా మీదపడి బాటిల్‌తో దాడి చేశారు

కావాలనే దాడి చేశారా?

రాహుల్‌ సిప్లిగంజ్‌: తెలియదు. కానీ, పొలిటికల్‌ బ్యాగ్రౌండ్‌ చూసుకుని వాళ్లు రెచ్చిపోయారు. ఎక్కడికి వెళ్లినా తమ హవా నడవాలని చూసే ఇలాంటి వాళ్ల గురించి నేను మాట్లాడాల్సి వస్తుందని అనుకోలేదు. 

గతంలో వాళ్లని ఎప్పుడైనా కలిశారా?

రాహుల్‌ సిప్లిగంజ్‌: ఎప్పుడూ కలవలేదు. అయితే, నాకు తెలిసింది ఏంటంటే.. వీళ్లంతా పబ్‌లకు వెళ్లి గొడవలు పడుతుంటారట. 

అమ్మాయిలను అసభ్య పదజాలంతో తిట్టారా?

రాహుల్‌ సిప్లిగంజ్‌: అవును కామెంట్లు చేశారు. వీడియోలో చూస్తే మీకు తెలుస్తుంది. 

మొత్తం వాళ్లెంతమంది ఉన్నారు?

రాహుల్‌ సిప్లిగంజ్‌: దాదాపు 10మంది ఉన్నారు. ఆ సమయంలో మావైపు నేను ఒక్కడినే ఉన్నా. 

దాడి జరిగిన వెంటనే ఎందుకు ఫిర్యాదు చేయలేదు?

రాహుల్‌ సిప్లిగంజ్‌: నాకు దెబ్బలు తగిలిన వెంటనే ఆస్పత్రికి వెళ్లాను. అక్కడ ట్రీట్‌మెంట్‌ తీసుకున్నా. ఆ తర్వాత నాపై దాడి చేసినవాళ్లు ఎవరో తెలుసుకునేందుకు ప్రయత్నించా. ఎందుకంటే రాజకీయం అండతో ఎలాంటి ఆధారాలు దొరక్కుండా చేస్తారేమోనని మళ్లీ వీడియో ఫుటేజ్‌ కోసం పబ్‌కు వెళ్లాను. 

భవిష్యత్‌లో వారి నుంచి మీకు ఆపద ఉంటుందని అనుకుంటున్నారా?

రాహుల్‌ సిప్లిగంజ్‌: వాళ్లు నన్నేం చేయగలరు.

మీపై ఎవరు దాడి చేశారో తెలుసా?

రాహుల్‌ సిప్లిగంజ్‌: అతని పేరు రితేశ్‌రెడ్డి అని మాత్రం వినిపించింది. పక్కనే మరో వ్యక్తి ఉన్నాడు అతను కూడా బాటిల్‌తో తలపై కొట్టాడు. 

మీ మాటతీరు, వ్యవహారశైలి కారణంగానే వాళ్లు దాడి చేశారా?

రాహుల్‌ సిప్లిగంజ్‌: అక్కడ అంత జరిగిన తర్వాత కూడా నేను వారితో మర్యాదగా మాట్లాడాలా? నాపై బాటిల్‌తో దాడి చేసిన తర్వాత కూడా నేను మాట్లాడకపోతే ఎలా? జనాలు ఊరికే నన్ను బిగ్‌బాస్‌ షోలో విజేతని చేయలేదు. నాపై ప్రేమతో, నాలో ఉన్న నిజాయతీ మెచ్చి నన్ను గెలిపించారు. అతని గురించి మాట్లాడి ఆ వ్యక్తిని ఫేమస్‌ చేస్తున్నట్లుంది. 

మీరు కూడా వాళ్లను తిట్టినట్లు ఉన్నారు?

రాహుల్‌ సిప్లిగంజ్‌: ప్రతి మనిషికి ఎమోషన్‌ ఉంటుంది. నాపై దాడి చేసిన వెంటనే  కోపం వచ్చి తిట్టాను. 

మీ వెంట వచ్చిన వారికి వాళ్లేమైనా కామన్‌ ఫ్రెండ్స్‌ అవుతారా?

రాహుల్‌ సిప్లిగంజ్‌: ఎవరూ లేరు. 

ఈ వివాదం మీ కెరీర్‌పై ఏమైనా ప్రభావం చూపిస్తుందా?

రాహుల్‌ సిప్లిగంజ్‌: ఏముంటుంది నాలుగు రోజులు జనాలు చూస్తారు. దీని గురించి ముచ్చట్లు పెట్టుకుంటారు. ఆ తర్వాత అందరూ మర్చిపోతారు. ‘ఫలానా రాహుల్‌ సిప్లిగంజ్‌పై మేము దాడి చేశామని వాళ్లు చెప్పుకొంటూ తిరుగుతారు’ అంతకుమించి ఏముంటుంది. 

దీనిపై రాజకీయంగా ప్రభావం ఉంటుందా?

రాహుల్‌ సిప్లిగంజ్‌: అతను తప్పకుండా చేస్తాడు. అయితే, ప్రభుత్వం న్యాయం చేస్తుందన్న నమ్మకం ఉంది. ఈ వివాదం పెద్ద పెద్దవాళ్ల వరకూ వెళ్లింది. 

ఆందోళనలో ఉన్న మీ అభిమానులకు ఏం చెప్పదలుచుకున్నారు?

రాహుల్‌ సిప్లిగంజ్‌: అందరిలానే ఎంజాయ్‌ చేసేందుకు పబ్‌కు వెళ్లాను. అక్కడ వాళ్లు రుబాబు చేస్తూ, నాపై దాడి చేశారు. వీడియోలో అంతా కనపడుతోంది కదా!

మీరు రెగ్యులర్‌గా పబ్‌లకు వెళ్తుంటారా?

రాహుల్‌ సిప్లిగంజ్‌: కచ్చితంగా. ఎందుకంటే నేనూ మనిషినే కదా! 

రాజకీయ ఒత్తిడులు వస్తే విత్‌ డ్రా అవుతారా?

రాహుల్‌ సిప్లిగంజ్‌: ఎట్టి పరిస్థితుల్లో కాను. వీళ్లను చూసి ఇంకా చాలా మంది ఇలాగే తయారవుతారు. న్యాయం జరగాలి. 

రాహుల్‌పైనే ఎందుకు దాడి చేశారు?

రాహుల్‌ సిప్లిగంజ్‌: అక్కడ పరిస్థితులు అలా ఉన్నాయి. 

మిమ్మల్ని మొదట కొట్టింది ఎవరు?

రాహుల్‌ సిప్లిగంజ్‌: నన్ను మొదటిగా కొట్టింది రితేశ్‌రెడ్డి. 

ఈ దాడితో పబ్‌లకు వెళ్లకూడదని ఏమైనా నిర్ణయం తీసుకున్నారా?

రాహుల్‌ సిప్లిగంజ్‌: మనం స్వేచ్ఛగా బతకాల్సిన దేశం ఇది. అక్కడకు వెళ్లొద్దు అంటే నేను భయపడాలా? మనకంటూ కొన్ని భద్రమైన ప్రదేశాల్లో ఎంజాయ్‌ చేసేందుకు వెళ్తాం. దాడి జరిగింది కదాని వెళ్లకుండా ఉంటామా? పోలీసులు, న్యాయవ్యవస్థ ఉన్నాయి. రేపు నేను గుడికి వెళ్తా. అక్కడ ఏమైనా చేస్తారేమోనని వెళ్లకుండా ఉంటానా? 

పబ్‌లో ప్రైవేటు సెక్యురిటీ ఉంటుంది కదా! వాళ్లు ఆపడానికి ప్రయత్నించలేదా?

రాహుల్‌ సిప్లిగంజ్‌: ఇద్దరు మాత్రమే ఉన్నారు. పదిమంది నాపై దాడి చేస్తుంటే వీళ్ల ఇద్దరి మాట ఎవరు వింటారు. 

మీపై దాడి జరుగుతుండగా అక్కడకు ఒక పోలీస్‌ వచ్చారు? మీరు పిలిచారా? ఆయనే వచ్చారా?

రాహుల్‌ సిప్లిగంజ్‌: అది పబ్‌ క్లోజింగ్‌ టైమ్‌. ఆ సమయంలో పోలీసులు వచ్చి చెక్‌ చేస్తారు. నాపై దాడి సరిగ్గా అదే సమయానికి జరిగింది. 

ఈ వివాదంలో ఫైనల్‌గా ఏం కోరుకుంటున్నారు?

రాహుల్‌ సిప్లిగంజ్‌: న్యాయం జరగాలని కోరుకుంటున్నా. 

 Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని