నాపై దాడి జరిగిందిలా: రాహుల్‌ సిప్లిగంజ్‌
close
Updated : 06/03/2020 18:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నాపై దాడి జరిగిందిలా: రాహుల్‌ సిప్లిగంజ్‌

కేటీఆర్‌ సర్‌ చర్యలు తీసుకోండి

హైదరాబాద్‌: ‘సీసీటీవీ ఫుటేజీ చూసిన తర్వాత న్యాయం ఎవరి పక్కన ఉంటే వారివైపు నిలబడండి’ అని గాయకుడ, ‘బిగ్‌బాస్‌ 3’ విజేత రాహుల్‌ సిప్లిగంజ్‌ మంత్రి కేటీఆర్‌ను కోరారు. పబ్‌లో తనపై జరిగిన దాడి ఘటనను ఉద్దేశిస్తూ ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ చేశారు. ఘటనకు సంబంధించిన వీడియోను షేర్‌ చేశారు. ‘ఆ గ్యాంగ్‌ నాపై ఎలా దాడి చేసిందో పుటేజీలో మీరే చూడండి. న్యాయం ఎవరి పక్కన ఉంటే వారి వైపే మాట్లాడండి. కేటీఆర్‌ గారు నేను తెలంగాణలో పుట్టాను. ఈ భూమి కోసం, టీఆర్‌ఎస్‌ పార్టీ కోసం చివరి వరకు పోరాడుతా. నాయకుల్ని నమ్మి వారికి ఓట్లు వేసి ఎన్నుకుంటాం. కానీ, వాళ్లు ఇలా తమ పదవుల్ని దుర్వినియోగం చేయకూడదు. మన సొంత టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యే సోదరుడు పబ్లిక్‌లో ఇలా తప్పుగా ప్రవర్తించడం, రాజకీయ బలం చూసుకుని ప్రజలపై దాడికి పాల్పడ్డాడని తెలిసి షాక్‌ అయ్యా’’

‘‘ఇకపై ఇలాంటివి ఆగాలి సర్‌. నాకు న్యాయం జరగాలి. ఈ ఘటనపై మీరు సరైన చర్యలు తీసుకుంటారని ఎదురుచూస్తున్నా. ఈ కేసును మీరు పర్యవేక్షించాలని కోరుతున్నా. నా తప్పు ఉంటే నాపై కూడా చర్యలు తీసుకోండి. కానీ, నా తప్పులేకపోతే.. ఓ సామాన్య వ్యక్తిగా నేను ఆరోజు ఎదుర్కొన్న ఆ ఘటనను ఎందుకు ఫేస్‌ చేయాలి. మీరు మా నాయకుడు. మీపై మాకు ఎంతో విశ్వాసం ఉంది. అందుకే మీకు విన్నవించుకుంటున్నా’’

‘నాకు న్యాయం జరగాలని డిమాండ్‌ చేస్తున్నా. క్రూరమైన వ్యక్తులు వారి అధికారి దుర్వినియోగం చేయకుండా ఇకపైనైనా చర్యలు తీసుకోవాలి. నా మనవిని విన్నందుకు ధన్యవాదాలు సర్‌’’ అంటూ రాహుల్‌ తన ఆవేదనను వెల్లడించారు.

ఇవీ చదవండి...
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని