ట్విటర్‌లో సూపర్‌స్టార్‌ రికార్డు
close
Updated : 07/03/2020 09:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ట్విటర్‌లో సూపర్‌స్టార్‌ రికార్డు

90 లక్షల ఫాలోవర్స్‌తో...

హైదరాబాద్‌: సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు ట్విటర్‌లో సరికొత్త రికార్డు సృష్టించారు. దక్షిణ చిత్ర పరిశ్రమలో 90 లక్షల ఫాలోవర్స్‌ సాధించిన తొలి నటుడిగా నిలిచారు. ఈ నేపథ్యంలో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తర్వాతి సినిమా విడుదల సమయానికి టాలీవుడ్‌ స్టార్‌ కోటి అనుచరుల్ని చేరుకుంటారని కామెంట్లు చేస్తున్నారు. 2010 ఏప్రిల్‌లో మహేశ్‌ ట్విటర్‌ ఖాతా ఆరంభించారు. సూపర్‌స్టార్‌ను 9 మిలియన్ల మంది ఫాలో అవుతుండగా.. ఆయన మాత్రం 26 మందిని అనుసరిస్తున్నారు. గతంలో కేవలం తన బావ గల్లా జయదేవ్‌ను మాత్రమే అనుసరించేవారు. ఇప్పుడు ఆ సంఖ్య 26కు చేరింది.

‘సరిలేరు నీకెవ్వరు’తో సంక్రాంతి హిట్‌ అందుకున్న మహేశ్‌ దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించనున్న సినిమాలో నటించనున్నారు. మరోపక్క మెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న ‘ఆచార్య’ సినిమాలో మహేశ్‌ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారని సమాచారం. ఈ ప్రచారంపై చిత్ర బృందం స్పందించలేదు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని