ట్వీపల్‌కు థ్యాంక్స్‌ చెప్పిన మహేశ్‌
close
Published : 07/03/2020 11:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ట్వీపల్‌కు థ్యాంక్స్‌ చెప్పిన మహేశ్‌

ట్వీట్‌ చేసిన సూపర్‌స్టార్‌

హైదరాబాద్‌: సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు ట్వీపల్‌కు(ట్విటర్‌ వాడేవారు) ధన్యవాదాలు చెప్పారు. తాజాగా ఆయన ట్విటర్‌ ఖాతాను అనుసరించే వారి సంఖ్య 90 లక్షలకు చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహేశ్‌ ట్విటర్‌ వేదికగా తనను అనుసరిస్తున్న వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.

‘నా ఖాతాను ఫాలో అవుతున్న ట్వీపల్‌కు 9 మిలియన్‌ థ్యాంక్స్‌. నా ఈ అద్భుతమైన ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు’ -ట్విటర్‌లో మహేశ్‌బాబు

2010 ఏప్రిల్‌లో మహేశ్‌ ట్విటర్‌ ఖాతాను ప్రారంభించారు. ఆనాటి నుంచి ఆయన తన కుమార్తె సితార, కుమారుడు గౌతమ్‌లకు సంబంధించిన ఫొటోలు, వీడియోలతో పాటు నమ్రతతో దిగిన పలు ఫొటోలను కూడా సందర్భానుసారం అభిమానులతో పంచుకుంటున్నారు. వీటితోపాటు ఆయన తన వృత్తిపరమైన జీవితానికి సంబంధించిన ప్రతి విషయాన్ని ట్విటర్‌ వేదికగా అభిమానులకు తెలియజేస్తుంటారు. ప్రస్తుతానికి మహేశ్‌ను 9 మిలియన్ల మంది ఫాలో అవుతుండగా.. ఆయన మాత్రం 26 మందిని అనుసరిస్తున్నారు.

సంక్రాంతి కానుకగా విడుదలైన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో  ప్రేక్షకులను అలరించారు మహేశ్‌. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మహేశ్‌ మేజర్‌ అజయ్‌ కృష్ణ పాత్రలో మెప్పించారు. ప్రస్తుతానికి షూటింగ్‌ల నుంచి కొంత విరామం తీసుకున్న మహేశ్ కుటుంబసభ్యులతో సరదాగా గడుపుతున్నారు. విరామం తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో నటించనున్నట్లు తెలుస్తోంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని