వామ్మో.. సమంత..!
close
Published : 07/03/2020 12:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వామ్మో.. సమంత..!

పాత ఫ్రెండ్‌ను ఎత్తిన బ్యూటీ

హైదరాబాద్‌: టాలీవుడ్‌ ముద్దుగుమ్మ సమంత అక్కినేని ఫిట్‌నెస్‌ విషయంలో తరచూ తన అభిమానులను ఫిదా చేస్తుంటారు. తన వర్కౌట్లకు సంబంధించిన వీడియోలను సైతం సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటుంటారు. తాజాగా సమంత జిమ్‌లో తన వర్కౌట్లకు సంబంధించిన కొన్ని వీడియోలను ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్‌ చేశారు. వర్కౌట్లలో భాగంగా 100 కిలోల బరువును ఎత్తి ఆశ్చర్యానికి గురి చేశారు. దీనికి సంబంధించిన వీడియోను షేర్‌ చేసిన సామ్‌.. ‘మరలా నిన్ను కలవడం చాలా సంతోషంగా ఉంది నా పాత నేస్తమా.. 100 కేజీల సుమో డెడ్‌ లిఫ్ట్‌’ అని సమంత పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘వామ్మో.. సమంత నువ్వు సూపర్‌’, ‘సమంత నువ్వు పవర్‌ ఫుల్‌’ అని కామెంట్లు పెడుతున్నారు. 

ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 7న విడుదలైన ‘జాను’ సినిమాతో జానకిదేవిగా ప్రేక్షకులను మెప్పించారు నటి సమంత. తమిళంలో క్లాసిక్‌ హిట్‌ ‘96’ చిత్రానికి రీమేక్‌గా ‘జాను’ తెరకెక్కింది. తమిళంలో త్రిష, విజయ్‌ సేతుపతి పోషించిన పాత్రలను తెలుగులో సమంత, శర్వానంద్‌ నటించారు. విఘ్నేశ్‌ శివన్‌ దర్శకత్వం వహించనున్న ‘కాత్తువక్కుల రెందు కాదల్‌’ సినిమాలో సమంత, నయనతార, విజయ్‌ సేతుపతి నటించనున్నారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని