అది అజిత్‌ సంతకం కాదు..!
close
Published : 07/03/2020 21:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అది అజిత్‌ సంతకం కాదు..!

ఫేస్‌బుక్‌ ఖాతాపై స్పందించిన లీగల్‌ టీం

చెన్నై: కోలీవుడ్‌ ప్రముఖ నటుడు అజిత్‌ కుమార్‌ త్వరలో సోషల్‌మీడియాలో అధికారిక ఖాతాను తెరవనున్నారంటూ నెట్టింట్లో చక్కర్లు కొడుతోన్న ఓ నోటీసుపై సదరు నటుడికి చెందిన లీగల్‌ టీం స్పందించారు. ఆ నోటీస్‌లో ఎంత మాత్రం నిజం లేదని వారు పేర్కొన్నారు. అంతేకాకుండా నోటీస్‌లో ఉన్న సంతకం కూడా అజిత్‌ది కాదని వారు తేల్చి చెప్పారు. ఈ మేరకు అజిత్‌కు చెందిన లీగల్‌ టీం శనివారం ఓ ప్రెస్‌నోట్‌ను విడుదల చేశారు.

‘నటుడు అజిత్‌ లీగల్‌ టీంకు చెందిన మేము ఆయన మాట ప్రకారం, ఆయన తరఫున ఈ నోటీసును విడుదల చేస్తున్నాం. త్వరలో తాను సోషల్‌మీడియాలో అధికారిక ఖాతాను తెరవనున్నట్లు అజిత్‌ పేర్కొన్న విధంగా శుక్రవారం సోషల్‌మీడియాలో ఓ నోటీస్‌ చక్కర్లు కొట్టింది. లెటర్‌ హెడ్‌తోపాటు, అజిత్‌ సంతకం కూడా నకిలీవే. అది చూసి మేము ఎంతగానో ఆశ్చర్యానికి లోనయ్యాం. ఇలాంటి తప్పుడు ప్రచారానికి పాల్పడిన వ్యక్తిని వెంటనే గుర్తించి తగిన చర్యలు తీసుకుంటాం.’ అని అజిత్‌ లీగల్‌ టీం పేర్కొంది. 

అంతేకాకుండా అజిత్‌కు ఎలాంటి సోషల్‌మీడియా ఖాతా లేదని, ఆయనకు సోషల్‌మీడియా మీద ఎలాంటి ఆసక్తి లేదని, ఫ్యాన్‌పేజీలను కూడా అతను సపోర్ట్‌ చేయడని లీగల్‌ టీం వెల్లడించారు. గతకొన్ని సంవత్సరాల క్రితం నుంచి అజిత్‌ సోషల్‌మీడియాకు దూరంగా ఉంటున్నారు. నిజం చెప్పాలంటే ఆయన మీడియా వారికి కూడా పెద్దగా ఇంటర్వ్యూలు ఇవ్వరు. అలాగే పబ్లిక్‌ ఈవెంట్స్‌కు కూడా దూరంగా ఉంటారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని