రూల్స్‌ పక్కనపెట్టి సెలబ్రేషన్స్‌కి వెళ్లిన నయనతార
close
Updated : 08/03/2020 15:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రూల్స్‌ పక్కనపెట్టి సెలబ్రేషన్స్‌కి వెళ్లిన నయనతార

ఫొటోలు వైరల్‌

చెన్నై: అగ్ర కథానాయిక నయనతార తన రూల్స్‌ పక్కన పెట్టి ఓ కళాశాలలో జరిగిన వేడుకలో సందడి చేశారు. ఈ బ్యూటీ సినిమా ప్రమోషన్లు, ఫంక్షన్లు, పబ్లిక్‌ ఈవెంట్స్‌కు దూరంగా ఉంటారన్న సంగతి తెలిసిందే. అయితే చెన్నైలోని ఓ కళాశాలలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో నయన్‌ పాల్గొనడంతో అందరూ సర్‌ప్రైజ్‌ అయ్యారు. ఈ వేడుకలో తీసిన ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. నయన్‌ బ్లాక్‌ ప్యాంట్‌సూట్‌లో అందంగా మెరిశారు.

నయన్ గత కొన్నేళ్లల్లో కేవలం అవార్డు వేడుకల్లో మాత్రమే కనిపించారు. పబ్లిక్‌ కార్యక్రమాలకు రాలేదు. ఇటీవల ఆమె, రజనీకాంత్‌ జంటగా నటించిన ‘దర్బార్‌’ సినిమా విడుదలై, హిట్‌ అందకుంది. ఆమె నటించిన ‘నెట్రికన్‌’ పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. ఇటీవల నయన్‌ మరో సినిమా ‘మూకుతి అమ్మన్‌’ షూటింగ్‌ పూర్తయింది. మేలో సినిమా విడుదల కాబోతోంది.

 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని