కొట్టి చంపేస్తారా?..ఆ ధైర్యం ఏంటి!: ప్రకాశ్‌రాజ్‌
close
Updated : 09/03/2020 17:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొట్టి చంపేస్తారా?..ఆ ధైర్యం ఏంటి!: ప్రకాశ్‌రాజ్‌

రాహుల్‌ సిప్లిగంజ్‌కు నటుడి మద్దతు

హైదరాబాద్‌: ‘ఓ వ్యక్తిని పబ్లిక్‌లో సీసాలతో దాడి చేస్తారా? ఆ ధైర్యం ఏంటి?..’ అని సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌ ప్రశ్నించారు. ఆయన గాయకుడు రాహుల్‌ సిప్లిగంజ్‌కు సోమవారం మద్దతు తెలిపారు. వీరిద్దరు ప్రభుత్వ చీఫ్‌ విప్‌ వినయ్‌ భాస్కర్‌ను అసెంబ్లీలో కలిశారు. ఇటీవల పబ్‌లో రాహుల్‌పై జరిగిన దాడి ఘటన గురించి చర్చించారు. ఈ కేసు విషయంలో నిందితులకు శిక్షపడాలని ఈ సందర్భంగా ప్రకాశ్‌రాజ్‌ మీడియాతో మాట్లాడారు.

‘రాహుల్‌పై దాడి చేయడం తప్పు. అతడి వెంట ఎవరూ లేరనుకోవద్దు. అతడికి మేమున్నాం, చాలా మంది అభిమానులు ఉన్నారు. పబ్‌లోకి వెళ్లడం తప్పని నేను చెప్పడం లేదు. కానీ సీసాలతో అలా కొట్టడం ఏంటి? చంపేస్తారా ఏంటి? ఆ అహంకారం తప్పు. ఒకడ్ని పట్టుకొని పది మంది కొడతారా.. రాహుల్‌కి రాజీపడే ఉద్దేశం లేదు. అయినా ఎందుకు రాజీపడాలి. తప్పుచేసిన వాడే రాజీపడతాడు. ఈ ఘటనను తీవ్రంగా తీసుకోమని రేపు కమిషనర్‌తో చెబుతా. రాహుల్‌కు ధైర్యం ఇస్తున్నానంతే. చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తుల్ని ఎవరుపడితే వారొచ్చి కొట్టేస్తారా? ఇద్దరి మధ్య గొడవలు ఉండొచ్చు, భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. కానీ ఇలా చేయడం సరికాదు. ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలి. న్యాయం కోసం పోరాడాలనేదే నా ఉద్దేశం..’ అని ప్రకాశ్‌రాజ్‌ చెప్పారు.

ఇటీవల ఓ పబ్‌లో రాహుల్‌పై కొందరు దాడి చేసిన సంగతి తెలిసిందే. సీసాలతో ఆయన్ను కొట్టారు. ఈ ఘటన వీడియోను రాహుల్‌ సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. తనకు న్యాయం జరగాలని కోరారు. తప్పు చేసిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్‌ను కోరారు. కొందరు నాయకులు పదవుల్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. 


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని