పెద్దాపురం కిట్స్‌లో ‘మైండ్‌ బ్లాక్‌’ ఫ్లాష్‌మాబ్‌.. వైరల్‌
close
Updated : 11/03/2020 11:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పెద్దాపురం కిట్స్‌లో ‘మైండ్‌ బ్లాక్‌’ ఫ్లాష్‌మాబ్‌.. వైరల్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: మహేశ్‌బాబు కథానాయకుడిగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక కథానాయిక. విజయశాంతి కీలక పాత్ర పోషించారు. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. మహేశ్‌ నటన, డైలాగ్‌ డెలివరీ, కామెడీ, డ్యాన్స్‌, ఫైట్స్‌ అభిమానులను విశేషంగా అలరించాయి. దేవిశ్రీ ప్రసాద్‌ అందించిన సంగీతం సినిమాకు హైలైట్‌గా నిలిచింది. ముఖ్యంగా ‘మైండ్‌ బ్లాక్‌’ సాంగ్‌ మాస్‌ను ఓ ఊపు ఊపేసింది. యువతను విశేషంగా ఆకట్టుకున్న ‘మైండ్‌ బ్లాక్‌’ పాటకు పెద్దాపురం కిట్స్‌(కాకినాడ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌)  కాలేజ్‌ దివిలి క్యాంపస్‌లోని విద్యార్థులు ఇటీవల ఫ్లాష్‌మాబ్‌ చేసి సందడి చేశారు. కాలేజ్‌లోని కొందరు విద్యార్థులు ఈ పాటకు బృందంగా కలిసి డ్యాన్స్‌ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ‘ఆ సాంగ్‌కు ఉన్న ఊపే వేరు’ అంటూ విద్యార్థులు ఈ పాటను సోషల్‌మీడియాలో పంచుకుంటున్నారు. కిట్స్‌ విద్యార్థులు చేసిన ఆ నృత్యాన్ని మీరూ చూసేయండి.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని