వివాహం చేసుకున్న ‘పరుగు’ మూవీ హీరోయిన్‌
close
Published : 14/03/2020 20:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వివాహం చేసుకున్న ‘పరుగు’ మూవీ హీరోయిన్‌

ఫొటో షేర్‌ చేసిన నటి

హైదరాబాద్‌: టాలీవుడ్‌ స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌ కథానాయకుడిగా తెరకెక్కిన ‘పరుగు’ సినిమాతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నటి షీలా. గత కొంతకాలం నుంచి సినిమాలకు దూరంగా ఉన్న షీలా ఇటీవల వివాహం చేసుకున్నారు. చెన్నైకి చెందిన ఓ వ్యాపారవేత్తను ఆమె పరిణయమాడారు. కుటుంబసభ్యులు, బంధువుల సమక్షంలో వివాహం వేడుకగా జరిగింది. ఈ మేరకు భర్తతో దిగిన ఓ ఫొటోను ఆమె ఫేస్‌బుక్‌ వేదికగా అభిమానులతో పంచుకుంది. ‘ఈరోజు మాకెంతో ప్రత్యేకమైనది. పోల్చడానికి మించిన సమయం.. మా గుండె లోతుల్లోని సంతోషం.. మేమిద్దరం కలిసి నూతన జీవితం ఆరంభించే ఓ కొత్త రోజు’ అని షీలా పేర్కొన్నారు.

2006లో విడుదలైన ‘సీతాకోకా చిలుక’ సినిమాతో షీలా తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత ఏడాదిలో విడుదలైన ‘రాజుభాయ్‌’ సినిమాలో మంచు మనోజ్‌ సరసన ఆమె నటించారు. కాకపోతే ఆ రెండు సినిమాలు షీలాకు ఆశించిన గుర్తింపు అందించలేకపోయాయి. అనంతరం ఆమె 2008లో విడుదలైన ‘పరుగు’ సినిమాలో బన్నీ సరసన ఆడిపాడారు. ఈ సినిమాతో ఆమె ప్రేక్షకులను ఎంతగానో మెప్పించారు. ‘పరుగు’ చిత్రం తర్వాత వరుసగా ఎన్టీఆర్‌, రామ్‌, బాలకృష్ణ చిత్రాల్లో షీలా నటించారు. 2011లో విడుదలైన ‘పరమ వీర చక్ర’ సినిమా తర్వాత షీలా తెలుగు తెరకు దూరంగా ఉన్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని