కమ్‌బ్యాక్‌ రష్మిక అంటోన్న నెటిజన్లు
close
Published : 15/03/2020 10:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కమ్‌బ్యాక్‌ రష్మిక అంటోన్న నెటిజన్లు

అసలేమైందంటే..

హైదరాబాద్‌: అందం, అభినయం, చిలిపితనం కలగలిసిన నటి రష్మిక. సినిమాలు, వాటి ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నప్పటికీ ట్విటర్‌ వేదికగా తన అభిమానులతో చేరువగానే ఉంటుంది ఈ చిన్నది. తాజాగా పలువురు అభిమానులు ట్విటర్‌ వేదికగా కమ్‌బ్యాక్‌ రష్మిక అని హ్యాష్‌ట్యాగ్‌తో పలు ట్వీట్లు పెట్టారు. అభిమానులు పెట్టిన ట్వీట్లకు రష్మిక సైతం తనదైన శైలిలో స్పందించారు. 

ట్విటర్‌లో ఎప్పుడూ చురుగ్గా ఉండే రష్మిక ఈ నెల 7వ తేదీ నుంచి సోషల్‌మీడియాకు కొంత దూరంగా ఉన్నారు. తరచూ తన ఫొటోలను, సినీ అప్‌డేట్స్‌ను పోస్ట్‌ చేసే రష్మిక ఒక్కసారిగా ట్విటర్‌కు దూరంగా ఉండడంతో అభిమానులు కొంత నిరాశకు గురయ్యారు. దీంతో ట్విటర్‌ వేదికగా.. కమ్‌బ్యాక్‌ రష్మిక అనే హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీట్లు చేశారు. ‘రష్మిక ట్విటర్‌ పాస్‌వర్డ్‌ మర్చిపోయినట్లు ఉన్నారు’, ‘తను ఆన్‌లైన్‌లోకి వస్తుందని వేచి చూస్తున్నాను’, ‘రష్మిక మేడమ్‌ ఎక్కడ ఉన్నారు? మీకు సంబంధించిన నోటిఫికేషన్స్‌ లేకపోవడంతో రోజులు నాకు చాలా కష్టంగా గడుస్తున్నాయి’ అని పేర్కొంటూ అభిమానులు పలు ట్వీట్లు పెట్టారు. దీంతో అభిమానులు పెట్టిన ట్వీట్లపై నటి రష్మిక స్పందించారు. ‘క్షమించండి.. కానీ ఇప్పుడు నేను వచ్చేశాను’ అని అభిమానుల ట్వీట్లకు రిప్లై ఇచ్చారు.

‘సరిలేరునీకెవ్వరు’ చిత్రంతో ఈ ఏడాది ఆరంభంలోనే మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు నటి రష్మిక. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మహేశ్‌ సరసన రష్మిక నటించారు. ప్రస్తుతం ఆమె అల్లు అర్జున్‌ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న చిత్రంలో నటిస్తున్నారు. సుకుమార్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్‌ లారీ డ్రైవర్‌గా కనిపించనున్నారని టాలీవుడ్‌లో టాక్‌ వినిపిస్తోంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని