ఆర్‌ఆర్‌ఆర్‌ టీం నుంచి స్పెషల్‌ విషెస్‌
close
Published : 15/03/2020 11:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆర్‌ఆర్‌ఆర్‌ టీం నుంచి స్పెషల్‌ విషెస్‌

హైదరాబాద్‌: బాలీవుడ్‌ ముద్దుగుమ్మ ఆలియాభట్‌ పుట్టినరోజు సందర్భంగా ఆర్‌ఆర్‌ఆర్‌ టీం స్పెషల్‌ విషెస్‌ తెలిపారు. ఈ మేరకు ఆర్‌ఆర్‌ఆర్‌ బృందం ఓ ట్వీట్‌ పెట్టారు. ‘మనోహరమైన వ్యక్తిత్వం ఉన్న అసాధారణమైన నటి ఆలియాభట్‌కు ఆర్‌ఆర్‌ఆర్‌ టీం నుంచి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు మాతో కలిసి పనిచేసే రోజు కోసం మేము ఎంతో ఆసక్తిగా ఉన్నాం’ అని ఆర్‌ఆర్‌ఆర్‌ బృందం పేర్కొంది. 

దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న రామ్‌చరణ్‌కు జంటగా ఆలియాభట్‌, కొమరంభీంగా కనిపించనున్న ఎన్టీఆర్‌కు జంటగా హాలీవుడ్‌ నటి ఒలీవియా మోరీస్‌ నటించనున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ ఓ కీలక పాత్రలో మెరవనున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని