దర్శకుడితో కలిసి సినిమా చూసిన మెగాస్టార్‌
close
Published : 16/03/2020 10:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దర్శకుడితో కలిసి సినిమా చూసిన మెగాస్టార్‌

నా కల నిజమైంది

హైదరాబాద్‌: టాలీవుడ్‌ యువ కథానాయకుడు నితిన్‌, రష్మిక జంటగా నటించిన చిత్రం ‘భీష్మ’. తాజాగా ఈ సినిమాను ఆదివారం టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి ఆ చిత్ర దర్శకుడు వెంకీ కుడుములతో కలిసి వీక్షించారు. ఈ విషయాన్ని తెలియచేస్తూ చిరంజీవితో దిగిన పలు ఫొటోలను వెంకీ ట్విటర్‌ వేదికగా షేర్‌ చేశారు. తాను దర్శకత్వం వహించిన చిత్రాన్ని తనకి ఎంతో ఇష్టమైన నటుడితో కలిసి చూడడం సంతోషంగా ఉందని వెంకీ పేర్కొన్నారు.

‘సినిమాల పట్ల నన్ను ఎంతగానో ప్రభావితం చేసిన వ్యక్తి, నా దేవుడు మెగాస్టార్‌. నేను దర్శకత్వం వహించిన చిత్రాన్ని ఆయనతో కలిసి చూడాలనే నా కల నిజమైన రోజు ఇది. మా ‘భీష్మ’ చిత్రాన్ని చూసి మమ్మల్ని, మా కష్టాన్ని ఎంతగానో ప్రశంసించిన చిరంజీవికి ధన్యవాదాలు. మీకు గొప్ప అభిమానినైన నేను ఈ విషయాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. గమనిక‌: చేతులను బాగా శుభ్రం చేసుకున్న తర్వాతనే మేము ఈ ఫొటోల్లో చూపించిన కరచాలనం చేసుకున్నాం. సరైన జాగ్రత్తలు పాటించండి. ఆరోగ్యంగా జీవించండి’ అని వెంకీ కుడుముల పేర్కొన్నారు.

అభిమాన నటుడి చిరంజీవిని కలవాలనే తన కలను సాకారం చేసిన నితిన్‌, రష్మిక, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌కు వెంకీ ధన్యవాదాలు తెలిపారు. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన రెండో చిత్రం ‘భీష్మ’. సేంద్రియ వ్యవసాయం గురించి తెలియచేసే కథాంశంతో ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి స్పందనను అందుకుంది. 

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని