పారిపోయిన కరోనా అనుమానితులు.. తారల ట్వీట్లు 
close
Published : 16/03/2020 22:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పారిపోయిన కరోనా అనుమానితులు.. తారల ట్వీట్లు 

ముంబయి: ఇటీవల మహారాష్ట్రలోని నాగపూర్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా వైరస్‌ అనుమానితులుగా గుర్తించిన నలుగురు వ్యక్తులు ఆసుపత్రి నుంచి పారిపోయిన సంగతి తెలిసిందే. ఈ వార్తపై బాలీవుడ్‌ తారలు బిపాస బసు, రితేష్‌ దేశ్‌ముఖ్‌ సహా పలువురు స్పందించారు. ఇలాంటి ప్రవర్తన మంచిది కాదని, ప్రతి ఒకరు ప్రభుత్వాన్ని, వైద్య అధికారులను విశ్వసించాలని వారు ట్విటర్‌ వేదికగా తెలిపారు.

‘ప్రజలు ఇంత అజ్ఞానంగా, బాధ్యతా రహితంగా ఎలా ఉంటారు. ఒక పౌరుడిగా అందరిలోనూ అవగాహన పెంచాలి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వానికి సాధ్యమైనంత సహాయం చేయాలి. ఇంత నిరాశతో బాధ్యతా రహితంగా ఉండడం ఇలాంటి సందర్భాల్లో చేయొద్దు. ఈ వార్త చూసి నేను నిర్ఘాంతపోయాను’ అని బిపాసా ట్విట్‌ చేశారు.

‘ఇది చాలా చాలా బాధ్యతారాహిత్యం. ప్రభుత్వం, వైద్య అధికారులు మీకు సాయం చేయనివ్వండి. మిమ్మల్ని మీరు వేరుచేసుకోవడం ద్వారా అపరిచుతులకి, మీ స్నేహితులు, మీ ప్రియమైన వారికి ప్రమాదం లేకుండా ఉంటుంది. మీకూ సరైన చికిత్స తీసుకోవచ్చు. మనమందరం సైనికులం. అందరం కలిసుండాలి. దీనిపై కలిసిపోరాడాలి’ అని రితేష్‌ దేశ్‌ముఖ్‌ ట్విట్‌ చేశారు.

కరోనా వైరస్‌ అనుమానితులుగా గుర్తించిన నలుగురు నాగపూర్‌ ఆసుపత్రి నుంచి శుక్రవారం రాత్రి పారిపోగా, తరువాత వారిని గుర్తించి పోలీసులు తీసుకొచ్చారు. వీరందరిని కరోనా సోకిన వ్యక్తి గదిలోనే ఉంచి చికిత్స చేస్తున్నందుకే అక్కడ నుంచి పారిపోయినట్లు చెప్పారు. ‘మా అందరినీ కరోనా వైరస్‌ ఉన్న వ్యక్తి గదిలోనే ఉంచారు. అతను వాడిన మరుగుదొడ్లనే మేము ఉపయోగించాం. మేం మమ్మల్ని వేరే వార్డులకి మార్చాలని అడిగాం. అయినా ఎవరూ స్పందించలేదు. దాంతో రాత్రి ఆసుపత్రి విడిచి వెళ్లిపోవాలని నిశ్చయించుకున్నాం. మేమంతా ఒకే సమయానికి ఆసుపత్రికి వచ్చి పరీక్షలు చేయించుకున్నాం. అయితే, మాలో ఇద్దరి నివేదికలు రాత్రే నెగెటివ్‌గా వచ్చాయి. మరో ఇద్దరి నివేదికల గురించి అడిగినా ఆసుపత్రి సిబ్బంది నుంచి ఎలాంటి స్పందనా లేదు. దాంతో ఆసుపత్రి విడిచి వెళ్లిపోయాం’ అని పారిపోయినవారిలో ఒకరు చెప్పారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని