ఆర్య జిమ్‌ వీడియో.. షాకైన నెటిజన్లు
close
Published : 17/03/2020 12:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆర్య జిమ్‌ వీడియో.. షాకైన నెటిజన్లు

చెన్నై: కోలీవుడ్‌తోపాటు టాలీవుడ్‌లోనూ గుర్తింపు పొందిన ఆర్య సోమవారం నెటిజన్లను ఆశ్చర్యపర్చారు. జిమ్‌లో కసరత్తులు చేస్తుండగా తీసిన వీడియోను ఆయన సోషల్‌మీడియా వేదికగా పంచుకున్నారు. అందులో 400 కిలోల బరువును లెగ్‌ ప్రెస్‌ చేస్తూ కనిపించారు. అంతేకాదు 130 కిలోల బరువును భుజాలపై మోశారు. ‘ఒక్కోసారి అత్యధిక బరువులు మోయాల్సి వస్తుంది. పైన కూర్చుని నవ్వుతూ పోజిస్తున్న మిస్టర్‌ జాన్సన్‌ బరువుతోపాటు మరో 400 కిలోలతో లెగ్‌ప్రెస్‌ చేశా. మిస్టర్‌ జై 130 కిలోల లిఫ్టింగ్‌కు సహాయం చేశారు’ అని పోస్ట్‌ చేశారు.

ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్‌ అవుతూ కామెంట్లు చేశారు. ఫిట్‌నెస్‌ పరంగా ఆర్య అందరికీ స్ఫూర్తి అని కొందరంటే.. ఆరోగ్యం జాగ్రత్తని మరికొందరు పేర్కొన్నారు. ఆర్య కథానాయకుడిగా ‘టెడ్డీ’ సినిమా తెరకెక్కుతోంది. ఆయన సతీమణి సాయేషా సైగల్ కథానాయిక. శక్తి సౌందర్‌ రాజన్‌ దర్శకుడు. స్టూడియో గ్రీన్‌ సంస్థ నిర్మిస్తోంది. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా టీజర్‌కు మంచి స్పందన లభించింది.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని