సామ్‌ నెం.1.. సంజన నెం.2.. సింధు నెం.3..!
close
Published : 17/03/2020 17:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సామ్‌ నెం.1.. సంజన నెం.2.. సింధు నెం.3..!

ప్రజలు మెచ్చిన సెలబ్రిటీలు వీరు

హైదరాబాద్‌: అందం, నైపుణ్యం.. దీనికి తోడు కొంచెం స్మార్ట్‌నెస్‌ కలిసిన సెలబ్రిటీలు వీరు. ప్రజలు వీరి ప్రతిభను మెచ్చి, ఓట్లు వేసేలా చేశారు. 2019 ‘హైదరాబాద్‌ టైమ్స్‌ మోస్ట్‌ డిజైరబుల్‌ ఉమన్‌’ జాబితాను విడుదల చేశారు. బ్యూటీ సమంత ఈ ఏడాది అగ్ర స్థానాన్ని దక్కించుకున్నారు. 2018లో ఆమె ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నారు. 2017లో 21 స్థానంలో ఉన్నారు. మూడేళ్లలో ఆమె ఈ ఖ్యాతిని దక్కించుకోవడం అభినందించాల్సిన విషయం. గతేడాది ఏడాది ‘మజిలి’, ‘ఓ బేబీ’, ‘సూపర్‌డీలక్స్‌’ సినిమాలతో సామ్ అలరించారు.

ఫెమినా మిస్‌ ఇండియా తెలంగాణ 2019 కిరీటం గెలుచుకుని.. ఫెమినా మిస్‌ ఇండియా రన్నరప్‌గా నిలిచిన సంజనా విజ్‌ రెండో స్థానంలో నిలిచారు. ఆమెకు యువతలో మంచి ఫాలోయింగ్‌ ఏర్పడింది.

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌ టోర్నీలో పసిడి పతకం గెలుపొందిన తొలి భారత షట్లర్‌గా చరిత్ర సృష్టించిన పీవీ సింధు మూడో స్థానం సొంతం చేసుకున్నారు. ఆమె 2018లో ఈ జాబితాలో ఏడో స్థానంలో ఉన్నారు.

గతేడాది ‘హైదరాబాద్‌ టైమ్స్‌ మోస్ట్‌ డిజైరబుల్‌ ఉమన్‌’ జాబితాలో మొదటి స్థానంలో ఉన్న కథానాయిక అదితిరావు హైదరి ఈ సారి నాలుగో స్థానంలో నిలిచారు. 2018లో ఆమె నటించిన ‘పద్మావత్‌’, ‘సమ్మోహనం’ సినిమాలు విడుదలయ్యాయి. త్వరలో ఆమె నటించిన ‘వి’ సినిమా విడుదల కాబోతోంది.

కథానాయిక పూజా హెగ్డే ఐదో స్థానం దక్కించుకున్నారు. గత ఏడాది ఈ బుట్టబొమ్మ ‘మహర్షి’, ‘గద్దలకొండ గణేష్‌’ సినిమాలతో తెలుగు వారిని అలరించారు. ఆమె హిందీలో నటించిన ‘హౌస్‌ఫుల్‌ 4’ సూపర్‌హిట్‌ అందుకుంది. పూజా 2018లో నాలుగో స్థానంలో ఉన్నారు.

గాయని రాజ కుమారి జాబితాలో ఆరో స్థానంలో నిలిచారు. సంగీత ప్రపంచంలో గాయనిగా ఆమె మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అనేక షోలు ఇచ్చి, మెప్పించారు.

టాలీవుడ్‌తోపాటు బాలీవుడ్‌లోనూ రాణిస్తున్న రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ఈ సారి ఏడో స్థానం దక్కించుకున్నారు. ఆమె 2019లో ‘దేవ్‌’, ‘దే దే ప్యార్‌ దే’, ‘ఎన్జీకే’, ‘మన్మథుడు 2’ వంటి సినిమాలతో అలరించారు. రకుల్‌ గత ఏడాది ఈ జాబితాలో తొమ్మిదో స్థానం ఉన్నారు. ఇప్పుడు ఇంకాస్త ముందుకొచ్చారు.

టాలీవుడ్‌ చందమామ కాజల్‌ ఎనిమిదో స్థానంలో నిలిచారు. గత ఏడాది పదో స్థానంలో ఉన్న ఆమె కాస్త ముందుకొచ్చారు. కాజల్‌ నటంచిన ‘సీత’, ‘రణరంగం’, ‘కోమలి’ సినిమాలు 2019లో విడుదలయ్యాయి.

‘ఛలో’తో టాలీవుడ్‌కు వచ్చిన రష్మిక ఈసారి ‘హైదరాబాద్‌ టైమ్స్‌ మోస్ట్‌ డిజైరబుల్‌ ఉమన్‌’ జాబితాలో తొమ్మిదో స్థానంలో నిలిచారు. 2018లో ఐదో స్థానంలో ఉన్న ఆమె ఈసారి నాలుగు అంకెలు కిందికి వచ్చేశారు. రష్మిక ‘డియర్‌ కామ్రేడ్‌’తో 2019లో ప్రేక్షకుల్ని అలరించారు.

ఫెమినా మిస్‌ ఇండియా ఆంధ్రప్రదేశ్‌-2019 కిరీటం దక్కించుకున్న నిఖితా తన్వానీ పదో స్థానంలో నిలిచారు. అందాల కిరీటం గెలుచుకున్న తర్వాత యువతలో ఆమెకు క్రేజ్‌ ఏర్పడింది.

ఇదే జాబితాలో చిత్ర పరిశ్రమకు చెందిన నిధి అగర్వాల్‌ 11వ స్థానంలో, కియారా అడ్వాణీ 12, రాశీ ఖన్నా 15, ఈషా రెబ్బా 16, పాయల్‌ రాజ్‌పుత్‌ 17, కీర్తి సురేశ్‌ 20, అనుపమ పరమేశ్వరన్‌ 21, తమన్నా 22, సాయిపల్లవి 23, శ్రీముఖి 25, అదా శర్మ 26, రెజీనా 28 స్థానాల్లో నిలిచారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని