కరోనాపై ‘నిశ్శబ్దం’ స్పందన
close
Updated : 19/03/2020 12:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనాపై ‘నిశ్శబ్దం’ స్పందన

జాగ్రత్తలను కచ్చితంగా ఫాలో అవ్వండి: అనుష్క

హైదరాబాద్‌: ప్రపంచదేశాల్లో కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) రోజురోజూకీ తీవ్రరూపం దాలుస్తోన్న తరుణంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని పేర్కొంటూ పలువురు నటీనటులు సోషల్‌మీడియా వేదికగా వీడియోలు పోస్ట్‌ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ‘నిశ్శబ్దం’ టీం సైతం ఓ ప్రత్యేకమైన వీడియోను పోస్ట్‌ చేసింది. ఈ వీడియోలో అనుష్క శెట్టి, సుబ్బరాజు, అవసరాల శ్రీనివాస్‌తోపాటు దర్శకుడు హేమంత్‌ మధుకర్‌ కరోనా బారినపడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియచేశారు. ‘కరోనా వైరస్‌ ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రమాదకరమైన పరిస్థితులను సృష్టించింది. డబ్ల్యూహెచ్‌వో, కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు చెప్పిన సూచనలను తప్పకుండా అవలంభించి కరోనా వైరస్‌ బారిన పడకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి’ అని నిశ్శబ్దం టీం పేర్కొంది.

అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్‌, సన్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘నిశ్శబ్దం’. మూగ అమ్మాయి సాక్షి పాత్రలో అనుష్క కనిపించనున్నారు. మాధవన్‌, సుబ్బరాజు, అంజలి, షాలినీపాండే, శ్రీనివాస్‌ అవసరాల కీలకపాత్రలు పోషించారు. హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్‌ 2వ తేదీన విడుదల కావాల్సి ఉంది.

 



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని