స్వీయ నిర్బంధంలోకి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌
close
Published : 19/03/2020 15:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

స్వీయ నిర్బంధంలోకి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌

ఇంట్లోని ఫర్నిచర్‌తో వర్కౌట్లు చేస్తోన్న నటి

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ కల్లోలం కారణంగా టాలీవుడ్‌ నటి రకుల్‌ ప్రీత్‌ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ఇంట్లోని ఫర్నిచర్‌తో వర్కౌట్లు చేస్తోన్న ఓ ఫొటోను సైతం రకుల్‌ ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేశారు. తాజాగా రకుల్‌ ఓ ప్రకటన చిత్రీకరణలో పాల్గొన్నారు. చిత్రీకరణ సమయంలో ఇతర బృందంతో కలిసి మాస్క్‌లు ధరించి దిగిన ఓ ఫొటోను సైతం ఇన్‌స్టా వేదికగా ఆమె షేర్‌ చేశారు. ఈ నేపథ్యంలో ఓ ఆంగ్లపత్రికతో రకుల్‌ మాట్లాడుతూ.. ‘నేను తాజాగా యాడ్‌ షూట్‌లో పాల్గొన్నాను. ప్రస్తుతం ఆ యాడ్‌ను ప్రదర్శించాల్సి ఉన్న నేపథ్యంలో చిత్రీకరణను వాయిదా వేయలేకపోయాం. యాడ్‌ షూట్‌లో పాల్గొన్న సమయంలో మేము అన్నీ రకాలైన జాగ్రత్తలను పాటించాం. సెట్‌లోని బృందం మొత్తం మాస్క్‌లను ధరించాం. అలాగే సెట్‌లోకి ప్రవేశించే ముందు జ్వరానికి సంబంధించిన చెకప్‌ చేసి.. అంతా ఓకే అనుకున్నాకనే సెట్‌లోకి ప్రతి ఒక్కరూ అడుగుపెట్టారు.’ అని రకుల్‌ తెలిపారు.

అనంతరం ఆమె తన తదుపరి సినిమా షూటింగ్‌ గురించి స్పందిస్తూ.. ‘కరోనా వైరస్‌ విస్తరిస్తోన్న కారణంగా నేను నటిస్తున్న రెండు సినిమా షూటింగ్స్‌ వాయిదా పడ్డాయి. మార్చి 31వరకూ అంటే సుమారు 15 రోజులపాటు నేను షూటింగ్స్‌ అన్నింటికీ దూరంగా ఉంటాను. నిజం చెప్పాలంటే మామూలుగా అయితే ఇప్పుడు నేను రెండు సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉండాల్సిన సమయం. కాకపోతే కరోనా వైరస్‌ కారణంగా షూటింగ్స్‌ ప్రస్తుతానికి రద్దు అయ్యాయి.’ అని రకుల్‌ తెలిపారు.

ఇదిలా ఉండగా తాజాగా రకుల్‌ షూటింగ్స్‌ ఏమి లేకపోవడంతో స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ఇందులో భాగంగా ఇంట్లోనే రకుల్‌ వర్కౌట్లు చేశారు. దానికి సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టా వేదికగా రకుల్‌ పోస్ట్‌ చేసింది. ‘మినహాయింపులనేవి క్యాలరీలను తగ్గించలేవు. ఇంట్లో ఉన్న సామాగ్రినే ఉత్తమంగా ఉపయోగించుకుని క్యాలరీలను తగ్గించుకోవచ్చు. స్వీయనిర్బంధం అనేది మీ ఎదుగుదలకు బ్రేక్‌ వేస్తుందని భావించకండి.’ అని రకుల్‌ తెలిపారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని