మోహన్‌బాబుకు సింహాసనం చేయించిన లక్ష్మి
close
Published : 20/03/2020 12:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మోహన్‌బాబుకు సింహాసనం చేయించిన లక్ష్మి

ఇన్‌స్టా వేదికగా ఫొటో షేర్‌ చేసిన నటి

హైదరాబాద్‌: టాలీవుడ్‌ నటుడు మోహన్‌బాబుకు ఆయన కుమార్తె మంచులక్ష్మి కొత్త సింహాసనం చేయించి ఇచ్చారు. గురువారం మోహన్‌బాబు పుట్టినరోజు సందర్భంగా సోషల్‌మీడియా వేదికగా ఆయనకు సంబంధించిన పలు ఫొటోలను షేర్‌ చేసిన మంచులక్ష్మి వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. ‘మా నాన్నకి కొత్త సింహాసనం.. ఈ సింహాసనంలోని మూడు సింహాలు.. మా ముగ్గురికి (లక్ష్మి, విష్ణు, మనోజ్‌) నిదర్శనం. నేనే దీనిని చేయించాను.’ అని మంచులక్ష్మి పేర్కొన్నారు.

సూర్య కథానాయకుడిగా తెరకెక్కుతోన్న తమిళ చిత్రం ‌‘సూరరైపోట్రు’. సుధ కొంగర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో ‘ఆకాశమే నీ హద్దురా’ అనే పేరుతో విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో మోహన్‌బాబు ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. దీనితోపాటు ఆయన చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న ‘ఆచార్య’ సినిమాలో కూడా ఓ ముఖ్యమైన భూమికను పోషించనున్నారంటూ వార్తలు వస్తున్నాయి. దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని